Live Updates:ఈరోజు (ఆగస్ట్-02) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-02 01:22 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 02 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం చతుర్దశి (రాత్రి 9-30 వరకు) తదుపరి పూర్ణిమ; పూర్వాషాఢ నక్షత్రం (ఉ. 7-27 వరకు) తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం, అమృత ఘడియలు (రాత్రి 11-16 నుంచి 2-53 వరకు), వర్జ్యం (మ. 3-32 నుంచి 5-10 వరకు) దుర్ముహూర్తం ( సా. 4-47 నుంచి 5-38 వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-30

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-02 12:18 GMT

- తమిళనాడు గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ కు కరోనా పాజిటివ్



2020-08-02 12:13 GMT

- మరికొద్ది రోజులు హాస్పటల్ లో నే ఉండాల్సిందిగా వైద్యుల సూచన

- వైద్యుల సూచన మేరకు హాస్పటల్ లోనే చికిత్స తీసుకుంటున్నట్లు ప్రకటించిన అభిషేక్ బచ్చన్

- “దురదృష్టవశాత్తు కొన్ని కొమొర్బిడిటీల కారణంగా కోవిడ్ -19 పాజిటివ్‌గా ఉండి ఆసుపత్రిలోనే ఉన్నారు.

- నా కుటుంబం కోసం మీ నిరంతర శుభాకాంక్షలు మరియు ప్రార్థనలకు ధన్యవాదాలు. చాలా వినయంగా, రుణపడి ఉంటాను.

- నేను దీన్ని ఓడించి (కరోనాను) ఆరోగ్యంగా తిరిగి వస్తాను! ప్రామిస్” అంటూ అభిషేక్ బచ్చన్ ట్వీట్

2020-08-02 11:44 GMT

- కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్

- ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అమిత్ షా

- కరోనా లక్షణాలతో టెస్ట్ చేయించుకున్న అమిత్ షా

- నా ఆరోగ్యం బాగానే ఉంది

- వైద్యుల సలహా మేరకు నన్ను ఆసుపత్రిలో చేర్పించారు

- గత కొద్ది రోజులుగా నాతో సంప్రదించిన వారంతా కరోనా టెస్టులు చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాను.

2020-08-02 11:41 GMT

- బిగ్ బీ అమితాబచ్చన్ కు కరోనా నెగిటివ్

- హాస్పటల్ నుండి డిశ్చార్జ్, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అభిషేక్ బచ్చన్

2020-08-02 05:54 GMT

ములుగు జిల్లా : కరోనా టెస్టుల్లో తీవ్ర గందరగోళం. -

 -పరీక్షలు చేయకుండానే చేసినట్టు రిపోర్ట్స్  

ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం

కరోనా లక్షణాలతో పరీక్షలు చేసుకునేందుకు ములుగు ఆస్పత్రికి వెళ్లిన మోహన్ ప్రసాద్

వివరాలు నమోదు చేసుకుని మరుసటి రోజు పరీక్షలు చేసూకునేందుకు రావాలని సూచించిన సిబ్బంది

నాలుగైదు రోజులు ఆస్పత్రి చుట్టూ తిరిగినా టెస్టులు చేయని వైనం

తర్వాత నెగెటివ్ వచ్చిందని మోహన్ ప్రసాద్ సెల్ ఫోన్ కు మెసేజ్ రావడంతో షాక్ తిన్న బాధితుడు

2020-08-02 05:49 GMT

-23 మందితో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటిని ప్రకటించిన బండి సంజయ్‌.

8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులతో కమిటి

కమిటిలో నలుగురు ప్రధాన కార్యదర్శులు

బీజేపీ రాష్ట్ర కమిటిలో ఆరుగురు మహిళలకు చోటు

ఉపాధ్యక్షులు: విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌ రావు,యెండల లక్ష్మినారాయణ, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌,యెన్నం,శ్రీనివాస్‌రెడ్డి,మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణి

ప్రధాన కార్యదర్శులు: ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, బండారు శృతి, మంత్రి శ్రీనివాసులు

కార్యదర్శులు: రఘునందన్‌రావు, ప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, మాధవి, ఉమారాణి

అధికార ప్రతినిధులు: కృష్ణ సాగర్ రావు, రజిని కుమారి, రాకేష్ రెడ్డి.

ట్రెజరర్‌: బండారి శాంతికుమార్‌, బవర్లాల్‌ వర్మ (జాయింట్ ట్రెజరర్‌)

ఆఫీస్‌ సెక్రటరీ: ఉమా శంకర్‌

2020-08-02 03:19 GMT

నల్గొండ :

- ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1750 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు...

- నల్గొండ లో 973 ,యాదాద్రి లో 223 కేసులు,సూర్యాపేట జిల్లాలో 696 కరోనా పాజిటివ్ కేసులు..

.- మొత్తం కేసుల్లో నల్గొండ పట్టణంలో నాలుగో వంతు నమోదు...

- ఇప్పటి వరకు 42 మంది మృతి...

2020-08-02 03:16 GMT

నల్గొండ : 

- పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.

- ప్రస్తుత నీటిమట్టం : 549.80 అడుగులు.

- ఇన్ ఫ్లో : 40,259 క్యూసెక్కులు.

- అవుట్ ఫ్లో : 2200 క్యూసెక్కులు.

- పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు.

- ప్రస్తుత నీటి నిల్వ : 209.3374 టీఎంసీలు.

2020-08-02 02:17 GMT

నిజామాబాద్ :

- జిల్లాలో 1139 కి చేరిన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య.

- 24 గంటల వ్యవధిలో 43 పాజిటివ్ కేసుల నమోదు.

- వేగంగా విస్తరిస్తున్న వైరస్.

2020-08-02 02:06 GMT

కామారెడ్డి :

- జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసుల నమోదు.

- 24 గంటల వ్యవధిలో 121 పాజిటివ్ కేసుల నిర్ధారణ.

- 971 కి చేరిన మొత్తం కేసుల సంఖ్య.

- ఇప్పటి వరకు కరోనా తో 16 మంది రోగుల మృతి.

Tags:    

Similar News