ఇది ఆ వయసులో ఉన్నవాళ్ళకు కీలకం

Update: 2019-05-24 13:02 GMT

చాలా మందికి నిద్ర పట్టనప్పుడు ఎదురయ్యే సమస్య చికాకు. ఏ పనిపై కూడా శ్రధ్ద లేకుండా పోవడం. శరీరం అలసటగా అనిపించడం లాంటివి ఎదురవుతాయి. అయితే నిద్ర పట్టకపోవడానికి ముఖ్యకారణం శరీరంలో నీటిశాతం తగ్గుతుండటమే కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్ర అనేది వయసు మీద పడినవారికి చాలా ముఖ్యం. రోజులో కనీసం 6 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయే పెద్దవాళ్ళలో నీటిశాతం 59% తగ్గే అవకాశం ఉన్నట్లుగా పరిశోధనలు చెబుతున్నాయి. ఒంట్లో ఉండే నీటి శాతాన్ని మెదడులోని పీయూషగ్రంథి వాసోప్రెసిన్‌ నియంత్రిస్తోంది.

శరీరంలో నీటిని ఎంత పట్టి ఉంచాలనేది మూత్రపిండాలకు సూచనలు అందిస్తుంది. అయితే ఒకవేళ నిద్ర తగ్గితే సరైన సమయానికి హర్మోన్ మూత్రపిండాలకు చేరుకోదు. దీంతో మూత్ర పిండాలు నియంత్రణను కోల్పోతాయి. నీరు భారీగా బయటకు వెళ్ళిపోవడంతో డీహైడ్రేషన్‌ కలుగుతుంది. అందువల్ల రాత్రి పూట కంటి నిండా నిద్రపోవడం మంచిది. మీకు నిద్రపట్టినట్లు అనిపించకపోతే నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగటం మంచిది. దీని వల్ల నీటిశాతం వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు.

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. కంటి నిండా నిద్రపోవడం వల్ల శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. ఆ రోజంతా ఉత్సాహంతో ఉంటారు. ముఖ్యంగా పెద్దవాళ్ళకు చాలా కీలకం. వారి శరీరం ఎక్కువగా విశ్రాంతిని కోరుకుంటుంది. సరైన సమయంలో నిద్ర, తిండి ఉండాలి. ప్రతిరోజు ఎన్ని పనులు ఉన్నప్పటికి ఒకే సమయానికి పడుకుని ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. పడుకునేటప్పుడు నిద్రపట్టకపోతే పుస్తకం చదవటం,సంగీతం వినడం,యోగా చేయడం వంటి మంచి అలవాట్లను చేసుకోవాలి 

Similar News