పేరెంట్స్ పిల్లలతో మాట్లాడండి ప్లీజ్..

Update: 2019-05-28 12:52 GMT

చిన్నపిల్లలు మాటలు సరిగ్గా రాకపోయినా ఎదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ కొందరు పెద్దలు వారి ప్రయత్నాన్ని పెద్దగా పట్టించుకోరు. అలా కాకుండా వారితో రోజులో కనీసం 5 గంటల పాటు మాట్లాడుతూ ఉంటే వారి మేధస్సు వికసిస్తుందనీ, ఆలోచనా పరిధి పెరుగుతుందనీ పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా రెండు నుంచి నాలుగు సంవత్సరాల వయస్సున్న పిల్లలు మాట్లాడే మాటలను చెప్పే కబుర్లను నిర్లక్ష్యం చేయాకూడదని వారు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో ఉన్న ఆసక్తిని గమనించకపోవడం వల్ల వారిలో ఆలోచనా శక్తి నశిస్తుందనీ , తెలివితేటలు వృద్ధి చెందవనీ వారు అంటున్నారు. పిల్లలకు కొత్త విషయాలు చెప్పడం, వారి మాటలు వినడం వల్ల తల్లిదండ్రులకి పిల్లల మధ్య ప్రేమానురాగాలు మరింత ఎక్కువవుతాయడని వారు చెబుతున్నారు. 

Similar News