Lifestyle: వెక్కిళ్లు ఎందుకు వస్తాయి.? ఏమైనా ప్రమాదమా.?
Why Do We Get Hiccups: వెక్కిళ్లు రావడం సర్వసాధారణమైన విషయం. వేగంగా భోజనం చేయడం, భోజనం చేస్తూ మాట్లాడటం, తగినంత నీరు తాగకపోవడం వంటి కారణాలతో వెక్కిళ్లు వస్తుంటాయి.
Why Do We Get Hiccups: వెక్కిళ్లు రావడం సర్వసాధారణమైన విషయం. వేగంగా భోజనం చేయడం, భోజనం చేస్తూ మాట్లాడటం, తగినంత నీరు తాగకపోవడం వంటి కారణాలతో వెక్కిళ్లు వస్తుంటాయి. సాధారణంగా కొన్ని నిమిషాల్లో వెక్కిళ్లు ఆగిపోతుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలంగా వెక్కిళ్లు వస్తూనే ఉంటాయి. ఇంతకీ వెక్కిళ్లు ఎందుకు వస్తాయి.? ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి.? ఇప్పుడు తెలుసుకుందాం.
వెక్కిళ్లకు కారణాలు ఇవే:
వేగంగా తినడం, తినే సమయంలో మాట్లాడడం. చల్లని పానీయాలు, మద్యం ఎక్కువగా తీసుకోవడం. మసాలా, కారం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం. ఒత్తిడి, ఆందోళన, ఉష్ణోగ్రతలో వేగంగా మార్పులు. గొంతులో వెంట్రుకలు లేదా ఇతర వస్తువులు వెళ్లడం. వీటితో పాటు ట్యూమర్లు, కొవ్వు కణాలు, తీవ్రమైన గ్యాస్ సమస్య కూడా వెక్కిళ్లకు దారి తీస్తాయి. డయాబెటిస్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, కిడ్నీ వ్యాధులు కూడా దీనికి కారణంగా చెబుతుంటారు.
వెక్కిళ్లు తగ్గించుకునేందుకు చిట్కాలు:
వెంట వెంటనే ఎక్కువ నీరు తాగడం వల్ల వెక్కిళ్లు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. త్రెన్పు ద్వారా గ్యాస్ బయటకు తీసేయండి, లోపల నిండిన గాలిని తేలిగా నోటి ద్వారా వదలండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి – 1 నుంచి 5 వరకూ లెక్క పెడుతూ గాలి పీల్చి మళ్లీ అలాగే వదలండి.
ఛాతి వైపు మోకాళ్లు తీసుకురావడం – నేలపై కూర్చుని మోకాళ్లను ఛాతికి దగ్గరగా తీసుకురావడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. చల్లటి నీటిని త్రాగడం వల్ల వెగస్ నాడిని ఉత్తేజింపజేస్తుంది. గొంతులో చల్లటి నీరు పోసి పుక్కిలించడం లేదా చక్కెర నోట్లో వేసుకుని తినడం వల్ల వెక్కిళ్లు తగ్గుతాయి.
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
వెక్కిళ్లు 48 గంటలకు పైగా కొనసాగుతున్నప్పుడు, అవి తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతంగా భావించాలి. ఇలాంటి సందర్భాల్లో తప్పకుండా వైద్యుడిని కలవాలి. ఆలస్యం చేస్తే నాడీ మండల వ్యవస్థకు హాని జరుగుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు.