జ్వరం ఉన్నప్పుడు అన్నం తినొద్దని అంటారు ఎందుకు?

Update: 2019-05-30 10:01 GMT

సీజన్ మారుతున్నప్పుడు జ్వరాలు రావడం కామన్. జ్వరం వచ్చినప్పుడు చాలామందికి ఏమీ తినాలని అనిపించదు. చాలా నీరసంగా ఉంటుంది. పోనీ అన్నం తిందాం అంటే.. తినకూడదని చెబుతారు. తింటే సమస్యలు వస్తాయని అంటారు. ఇందులో ఎంతవరకు నిజముందో చాలా మందికి తెలియదు.. ఇదే విషయంపై వైద్యులని వివరణ అడిగితే.. జ్వరం వచ్చినప్పుడు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. పాలు, బ్రెడ్, కొబ్బరినీళ్లు, ఇడ్లీ, ఆయిల్ తక్కువగా ఉన్న ఐటెమ్స్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

అన్నం తీసుకోవడం వల్ల జీర్ణం కావడానికి సమయం పడుతుంది కాబట్టి.. తీసుకోకపోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.జ్వరంగా ఉన్న సమయంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఏ ఆహారమైనా సరే అరగడానికి సమయం పడుతుంది. కాబట్టి.. అన్నం తీసుకోవడాన్ని అవాయిడ్ చేయడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. 

Similar News