పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏమిటి?

Update: 2019-05-13 04:42 GMT

వివాహమైన దంపతులకు సంతాన భాగ్యం ఓ ఆకాంక్ష.. ఓ అవసరం. తమ వారసుల కోసం తహతహలాడని వారుండరు. ప్రతి స్త్రీ కూడా మాతృత్వాన్ని ఆస్వాదించాలని, అనుభవించాలని ఉవ్విళ్లూరుతుంది. ప్రతి స్త్రీ అమ్మా అని... ప్రతి పురుషుడు నాన్నా అని పిలిపించుకునేందుకు ఆశపడుతుంటారు. అయితే కొందరు సంతానం భాగ్యం లేక ఇబ్బంది పడుతుంటారు. పిల్లలు పుట్టకపోతే కలిగే బాధేమిటో ఆ దంపతులకే తెలుస్తుంది. ఐటీ రంగాలలో పనిచేసే ఉద్యోగుల్లో ప్రతి ఏడుజంటల్లో ఒక జంట సంతాన లేమితో బాధపడుతోంది.

ప్రతి మగవారిలో సాధారణంగా 3-6 మిల్లీలీటర్ల వీర్యం ఉత్పత్తి అవుతుంది. ఈ వీర్యంలో దాదాపు 60 నుండి 150 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి. ప్రతి వీర్యకణానికి తల, మెడ, తోక అనే భాగాలు ఉంటాయి. 80 శాతం వీర్యకణాలు మామూలు ఆకృతిని కలిగి వుంటాయి. మామూలు వీర్యంలో దాదాపు 60 నుంచి 70 శాతం చురుకుగా కదిలే వీర్యకణాలుంటాయి. పైన చెప్పిన విధంగా వీర్యం వీర్యకణాలను కలిగిఉంటే దానిని సంతానం కలిగించే వీర్యంగా అభివర్ణించవచ్చు. సాధారణంగా సంతాన సాఫల్య సమస్యలను పరిశీలిస్తే మగవారిలో 40 శాతంగా ఉంటుంది.

ఇద్దరిలో కలిపి 10 శాతం సమస్యలు ఉంటే, తెలియని కారణాలు 10 శాతం ఉంటాయి. ముఖ్యంగా సంతానం కలగకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆలస్యపు వివాహాలు, మానసిక ఆందోళన, పని ఒత్తిడి,మారిన జీవన శైలి, ఊబకాయం, రుతుక్రమం తప్పడం వంటి అంశాలే ఇందుకు ప్రధాన కారణం.. అంతేకాకుండా కొందరు పురుషులు ఎక్కువగా మద్యం. పొగాకును వినియోగిస్తారు. దీని వలన ఎర్రరక్తకణాలు తగ్గిపోయి శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది. ఇది కూడా సంతాన లేమికి కారణమవుతుంది. కొందరిలో వంశానుగతంగా కూడా వీర్యకణాలు తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది.

మరికొందరిలో డిఎన్‌ఏ దెబ్బతినడం వల్ల ఈ సమస్య వస్తుంది. సంతానం కలగడంలో స్థూలకాయం పెద్ద అవరోధంగా ఉంటుంది. శరీరం బరువు పెరిగిపోయినప్పుడు హర్మోన్ సంబంధిత మార్పులు వస్తాయి. ప్రత్యేకించి గొనాడో ట్రోఫిన్ రిలీజింగ్ హర్మోన్ వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల శుక్రకణాలు బాగా ఉత్పత్తి అవుతాయి. దీంతో సంతాన సమస్యలు దూరమవుతాయని ఓ పరిశోధనలో తేలింది. కాబట్టి పిల్లలు కావాలనుకునేవారు తరచూ ఎక్సర్‌‌సైజ్‌లు చేయడం మంచిది. ఎక్కువ గంటలు అధిక ఉష్టోగ్రతలో పనిచేయడం, ఎక్కువ గంటలు కంప్యూటర్ల ముందు కూర్చోవడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. వృషణాల్లోంచి పురుషాంగంలోకి వచ్చే మార్గంలో ఏర్పడే అడ్డంకుల వల్ల అంటే వ్యాన్ డిఫరెన్స్ ఆబ్‌స్ట్రక్షన్, ల్యాక్ ఆఫ్ వ్యాస్ ఢిఫరెన్స్ వంటి సమస్యలు కూడా సంతానలేమికి కారణమవుతాయి. 

Similar News