బరువు పెరగాలన్న, తగ్గాలన్న ఒక్కటే ఆకుకూర!

బరువు పెరగాలన్న, తగ్గాలన్న ఒక్కటే ఆకుకూర! బరువు పెరగాలన్న, తగ్గాలన్న ఒక్కటే ఆకుకూర!

Update: 2019-10-05 09:55 GMT

ఆకుకూరలు తింటే ఆయుష్షును పెంచుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకుకూరలను రోజు ఒక కప్పైనా డైట్‌లో చేర్చుకుంటే అనారోగ్య సమస్యలు పూర్తిగా దూరమవుతాయని వారు చెబుతున్నారు. ఆకుకూరల్లో చాలా ప్రోటీన్స్ వుంటాయి. ఈ ఆకుకూరల్లో ముఖ్యమైనది పొన్నగంటి కూర. ఈ ఆకుకూరతో బరువు పెరగవచ్చు. అలాగే బరువు తగ్గటానకి కూడా పొన్నగంటి కూర ఉపయోగపడుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక బరువు ఉన్న వారు తగ్గలన్నా.. అలాగే చూడటానికి చాలా సన్నగా ఉన్నవారు.. బరువు పెరగాలన్నా.. పొన్నగంటి కూర చక్కటి ఫలితాలను ఇస్తుందంటున్నారు నిపుణులు.

బరువు పెరగాలనుకునే వారు కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు పొన్నగంటి కూరను ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. 

Tags:    

Similar News