Kidney disease: రాత్రుళ్లు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? కిడ్నీలు డేంజర్‌లో పడుతున్నట్లే..
Kidney disease: మూత్రపిండాలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇవి శరీరం నుంచి అదనపు నీరు, మలినాలను తొలగించి, రక్తం శుద్ధి చేస్తాయి.
Kidney disease: రాత్రుళ్లు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? కిడ్నీలు డేంజర్‌లో పడుతున్నట్లే..
Kidney disease: మూత్రపిండాలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇవి శరీరం నుంచి అదనపు నీరు, మలినాలను తొలగించి, రక్తం శుద్ధి చేస్తాయి. మూత్రపిండాల పనితీరులో ఏదైనా ఆటంకం ఏర్పడితే, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ముఖ్యంగా, మూత్రపిండాల వైఫల్యం శరీరానికి తీవ్రమైన ముప్పును కలిగించవచ్చు. అయితే కిడ్నీల పనితీరులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయాన్న విషయాన్ని కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అవేంటంటే..
తరచుగా మూత్ర విసర్జన..
బహుశా చాలా మందికి రాత్రిపూట ఒక్కసారి లేదా రెండుసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం సహజం. అయితే, దీనికి మించి తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తే, అది మూత్రపిండాల పనితీరుకు సంబంధించిన సమస్యకు సంకేతంగా ఉండొచ్చు. మూత్రపిండాలు సరిగ్గా ఫిల్టర్ చేయకపోతే, శరీరంలో ద్రవ సమతుల్యత దెబ్బతినడం వల్ల ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అధిక దాహం
మూత్రపిండాల సమస్యల కారణంగా శరీరంలో నీటి స్థాయిలు అసమతుల్యమవుతాయి. దీని ప్రభావంగా రాత్రిపూట అధిక దాహానికి తీస్తుంది. రాత్రుళ్లు పదే పదే నీరు తాగాల్సి వస్తే కిడ్నీల పనితీరులో ఏదో తేడా ఉందని భావించాలి. ఇది బలహీమన కిడ్నీలకు సంకేతంగా భావించాలి.
మూత్ర విసర్జనలో నొప్పి, మంట..
కిడ్నీ సమస్యలు మూత్ర నాళాలలో ఇన్ఫెక్షన్‌కు, వాపునకు కారణమవుతాయి. దీని వల్ల మూత్ర విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన నొప్పి లేదా మంట అనిపించవచ్చు. ఇది మూత్రపిండాల ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలకు సంకేతం కావొచ్చు.
మూత్రంలో రక్తం..
మూత్రంలో రక్తం కనిపించడం చాలా తీవ్రమైన సమస్య. ఇది మూత్రపిండాల ఇన్ఫెక్షన్, రాళ్లు, లేదా తీవ్రమైన మూత్రపిండాల వ్యాధికి సూచన కావొచ్చు. మూత్రంలో ఎర్రరంగు మార్పులు గమనిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
నిద్ర సమస్యలు..
మూత్రపిండాలు శరీరంలోని మలినాలను సరిగ్గా ఫిల్టర్ చేయకపోతే, రక్తంలో టాక్సిన్లు పెరుగుతాయి. దీని ప్రభావంగా నిద్ర కుదురుగా పట్టదు, తరచూ మేల్కువ వస్తుంది. నిద్రలేమితో ఎక్కువగా రోజులుగా బాధపడుతుంటే అది ఇతర మానసిక సమస్యలకు సైతం దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు.
కిడ్నీలు ఎలా కాపాడుకోవాలి.?
రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి.
అధిక ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక ప్రోటీన్‌ను తీసుకోవడం తగ్గించాలి.
నిత్యం వ్యాయామం, యోగా, లేదా వాకింగ్ చేయడం అలవాటుగా మార్చుకోవాలి.
మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు నియంత్రిత జీవనశైలిని అనుసరించాలి.
మూత్రంలో మార్పులు గమనించిన వెంటనే వైద్యుని సంప్రదించాలి.