ఉడకని మాంసం.. బ్రెయిన్ డ్యామేజ్‌కి కారణం! డాక్టర్లకే షాక్ ఇచ్చిన కేసు
అమెరికాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన డాక్టర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సరిగా ఉడకని బేకన్ (పంది మాంసం) తినడం వల్ల ఓ వ్యక్తి మెదడులో తీవ్ర ఇన్ఫెక్షన్ వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని వైద్యులు గుర్తించారు.
ఉడకని మాంసం.. బ్రెయిన్ డ్యామేజ్‌కి కారణం! డాక్టర్లకే షాక్ ఇచ్చిన కేసు
అమెరికాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన డాక్టర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సరిగా ఉడకని బేకన్ (పంది మాంసం) తినడం వల్ల ఓ వ్యక్తి మెదడులో తీవ్ర ఇన్ఫెక్షన్ వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని వైద్యులు గుర్తించారు.
ఉడకని మాంసం ప్రమాదం
నాన్ వెజ్ లవర్స్‌కి చికెన్, మటన్, పోర్క్ లాంటివి ఇష్టమే. కానీ అవి పూర్తిగా ఉడకకపోతే ప్రాణాలకు ముప్పే. బాగా ఉడకని మాంసం (Undercooked meat) వల్ల బాక్టీరియా, పారాసైట్స్ శరీరంలోకి ప్రవేశించి ప్రాణాంతక సమస్యలు తెస్తాయి.
బేకన్ వల్ల కలిగిన ఇన్ఫెక్షన్
USలో ఓ వ్యక్తికి క్రిస్పీగా కాకుండా మృదువుగా ఉన్న బేకన్ అంటే ఇష్టం. అతను రెగ్యులర్‌గా తినే అలవాటు పెట్టుకున్నాడు. కొద్ది రోజులకే విపరీతమైన తలనొప్పి వచ్చింది. మొదట్లో లైట్‌గా తీసుకున్నా, నొప్పి ఎక్కువవడంతో డాక్టర్‌ని సంప్రదించాడు. స్కాన్‌లో మెదడులో అనేక గాయాలు (Lesions) ఉన్నట్లు తేలింది.
అసలు కారణం ఏమిటి?
వైద్యులు చేసిన రిపోర్ట్‌లో పోర్క్ టేప్‌వార్మ్స్ అనే పారాసైట్స్ అతని శరీరంలోకి ప్రవేశించాయని తేలింది. ఇవి సరిగా ఉడకని పంది మాంసంలో ఉండే టేప్‌వార్మ్ లార్వా. ఇవి మెదడుకు చేరి సిస్ట్‌లుగా మారి న్యూరోసిస్టిసెర్కోసిస్ అనే వ్యాధికి కారణమయ్యాయి.
చికిత్సతో తప్పిన ప్రమాదం
డాక్టర్లు అతనిని వెంటనే ICUలో అడ్మిట్ చేసి యాంటీ-పారాసైటిక్ డ్రగ్స్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ మెడికేషన్స్ ఇచ్చారు. కొన్ని వారాల చికిత్స తర్వాత బ్రెయిన్‌లో గాయాల సైజ్ తగ్గి, తలనొప్పి కూడా కంట్రోల్ అయ్యింది.
జాగ్రత్తలు తప్పనిసరి
నాన్ వెజ్ ఫుడ్ కనీసం 63°C (145°F) వద్ద పూర్తిగా ఉడికించాలి.
మాంసం వండేటప్పుడు ఫుడ్ థర్మోమీటర్ వాడితే సేఫ్.
వంట సమయంలో క్లీన్లీనెస్ తప్పనిసరి.
చాపింగ్ బోర్డ్స్, కత్తులు వేరే ఫుడ్‌కి వాడకుండా శుభ్రం చేయాలి.
బయట తినేటప్పుడు కిచెన్ హైజీన్ గమనించాలి.
నిపుణులు హెచ్చరిస్తున్నారు: “ఉడకని మాంసం తినడం ప్రాణాలతో ఆటపట్టుకోవడమే” అని.