కావాల్సిన పదార్ధాలు :
కొబ్బరి తరుము : రెండు కప్పులు
చెక్కెర : రెండు కప్పులు
నెయ్యి,: సరిపడినంత
యాలాకుల పొడి : సరిపడినంత
జీడిపప్పు : సరిపడినంత
తయారీ విధానం :
స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు ముక్కలను వేసుకుని దోరగా వేపుకోవాలి. తరువాత కొబ్బరి తురుమును వేసుకుని సిమ్‌లో ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తురుము లైట్ బ్రౌన్ కలర్‌లోకి మారగానే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్‌ను రెడీ చేసెకోవాలి..స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చెక్కర వేసుకోవాలి. తరువాత అరకప్పు నీటిని వేసుకోవాలి. చెక్కెర పాకం పట్టాలి. చెక్కర బాగా కరిగిపోయిన తరువాత యాలాకుల పొడి వేసుకోవాలి..తరువాత బాగా కలుపుకోవాలి. తరువాత కొబ్బరి తురుముని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆప్ చేసుకోవాలి. ప్లేట్‌లో కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని కావాల్సని షేష్ చేసుకోవాలి. కత్తితో స్లైట్ గా కట్ చేసుకుని షేప్ చేసుకోవాలి. మిశ‌్రమాన్ని 10 నిమిషాల ఆరనివ్వాలి. తరువాత ముక్కలుగా కట్ చేసుకుంటే యమ్మీ కొబ్బరి బర్ఫీ రెడీ.