టూత్ పేస్ట్ తో ఉపయోగాలెన్నో ...

Update: 2019-05-27 14:04 GMT

టూత్ పేస్ట్ తెల్లగా ఉంటుంది. పళ్ళు తోముకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటారు కానీ పేస్ట్ దంతాలు శుభ్రం చేసుకోవడానికే కాదు దాంతో ఎన్నో ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఓ సారి చూద్దాం

సెల్ ఫోన్ల మరకలకూ పొవడానికి

సెల్ ఫోన్లపై మరకలు ఉంటే నంబర్లు, మెసేజ్ లు సరిగ్గా కనిపించవు. అందుకే, సెల్ ఫోన్ లపై మరకలను తొలగించడానికి టూత్ పేస్ట్ సహయపడుతుంది. ఇంకు మరకలు, జిడ్డు లాంటివి సెల్ ఫోన్ పై ఉంటే, కాస్త టూత్ పేస్టు రాయాలి. ఆ తర్వాత పోడి గుడ్డతో బాగా తుడిచేయాలి.

మెరిసే పియానో కీస్:

పియానో చేతిలో ఎక్కువగా వాయించడం ద్వారా కీస్ పై మరకలు ఏర్పడతాయి. వాటిని టూత్ పేస్ట్ హెల్ప్ తో పోగొట్టవచ్చు. టూత్ బ్రష్ మీద టూత్ పేస్టుని అప్లై చేసి ఆ బ్రష్ తో పియానో కీస్ ని తుడవాలి ఆ తరువాత తడి వస్త్రంతో రబ్ చేయాలి. దీంతో పియానో నీటిగా కనిపిస్తుంది.

బూట్లు తెల్లగా కనిపించడానికి:

తెల్లటి బూట్లపై చిన్న మరక పడినా బాగా కనిపించదు. తెల్లటి బూట్లను శుభ్రం చేయడానికి కూడా టూత్ పేస్టుని ఉపయోగించవచ్చు. వాటిపై కాస్త పేస్టు రాసి ఆ తరువాత బ్రష్ తో తుడవాలి. తర్వాత బూట్లను కడిగితే చాలు, కొత్త బూట్లలా కనిపిస్తాయి.

ఫర్నిచర్ పై నీటి మరకలు పోగొట్టవచ్చు:

ఇంట్లోని ఫర్నిచర్‌పై టీ,ఏదైన పండ్ల రసాల నీరు పడి మరకలు ఏర్పడుతాయి. వాటిని టూత్ పేస్టు సహాయంతో పోగొట్టుకోవచ్చు. ఓ గుడ్డను తీసుకుని దానిపై నాన్ జెల్ టూత్ పేస్టుని అప్లై చేసి ఆ వస్త్రంతో ఆ ఫర్నిచర్ ను తుడవాలి. ఆరిన తర్వాత చూస్తే మరకలు లేకుండా క్లిన్‌గా కనిపిస్తాయి.

గోడలపై ఉన్న మరకలను పోగేట్టేందుకు

ఇంట్లో చిన్న పిల్లలు గోడలపై పెన్సిళ్ళతో కానీ పేన్నులతో కానీ రాసేస్తుంటారు. అలాంటి గీతలను పోగోట్టేందుకు టూత్ పేస్ట్ ఉపయోగపడుతుంది. కాస్త టూత్ పేస్టుని తీసుకొని వాటిపై రాసి, కొంచెం సేపు అయ్యాక ఓ క్లాత్ తో తుడిచేసేయండి దీంతో గోడలు నీటిగా కనిపిస్తాయి. 

Similar News