మహిళలకు మాత్రమే.. ఆ కోరికను వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు..

Update: 2019-05-13 05:30 GMT

రోటిన్‌కి భిన్నంగా.. ఈ ప్రపంచానికి దూరంగా వెళ్లి.. ప్రశాంతంగా గడపాలని చాల మంది మహిళలకు ఉంటుంది. అలాంటి చోటుకి వెళ్లాలంటే.. మగవారిని తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. బయటికి వెళ్లాదాం అంటే వారు ఫోజు కొడుతుంటారు. అసలు మగవారితో సంబంధం లేకుండా.. మహిళలకు ఓ గొప్ప అనుభూతిని ఇచ్చే చోటు దొరికితే.. ఎలా ఉంటుంది. వాళ్ల ఆనందాని అవధులు ఉండవు. అలాంటి చోటే ఫిన్లాండ్‌లో ఉంది.

ప్రశాంతంగా గడపాలన్న కోరికను మహిళలు వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేకుండా.. ఓ దీవిని అభివృద్ధి చేసింది క్రిస్టియానా లోథ్ అనే మహిళ. ఈ దీవి ఫిన్లాండ్ తీరంలో 8.4 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనంతో కళకళలాడుతూ కనిపిస్తుంది. అక్కడ మగవారికి ప్రవేశం లేదు. మహిళలను మాత్రమే అనుమతిస్తారు. ఆ ద్వీపం పేరు 'సూపర్ షీ'. ఇందులోకి ప్రవేశించాలంటే ముందుగా సూపర్ షీ గ్రూపులో సభ్యత్వం తీసుకోవాలి. తర్వాత క్రిస్టియానా లోథ్ నిర్వహించే ఇంటర్వ్యూలో విజయం సాధించాలి. అప్పుడే దీవిలోకి ప్రవేశం లభిస్తుంది.

సూపర్ షీ ద్వీపంలో అందమైన కాటేజీలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే మహిళామణుల కోసం యోగా, మెడిటేషన్, తోటపని తదితర కార్యకలాపాలు రూపకల్పన చేశారు. గత ఏడాది జూన్‌లో ప్రారంభమైన సూపర్ షీ దీవి.. సర్వాంగ సుందరంగా ముస్తాబై.. మహిళామణులకు సాదరంగా స్వాగతం పలికేలా ఉంటుంది.

Similar News