Respiratory Diseases: వర్షాకాలంలో శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం ఎక్కువ.. ఈ జాగ్రత్తలు తీసుకోపోతే ఆస్పత్రికే..!

Respiratory Diseases: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.

Update: 2023-07-21 16:00 GMT

Respiratory Diseases: వర్షాకాలంలో శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం ఎక్కువ.. ఈ జాగ్రత్తలు తీసుకోపోతే ఆస్పత్రికే..!

Respiratory Diseases: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ చల్లటి వాతావరణానికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోయి జలుబు, దగ్గు ఏర్పడుతాయి. దీంతో రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

జలుబు

వర్షాకాలంలో జలుబు సమస్య సర్వసాధారణం. దీనివల్ల పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడుతారు. ఈ సీజ‌న్‌లో ఈ స‌మ‌స్యని ప్రతి ఒక్కరు ఎదుర్కొంటారు. కానీ పిల్ల‌ల విష‌యంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జలుబు చేసినప్పుడు వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఇలాంటి సమయంలో వేడి నీరు తాగడం, ఆవిరి పట్టడం చేయాలి. మంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి.

న్యుమోనియా

న్యుమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్. ఇది బ్యాక్టీరియా, వైరస్ వల్ల వస్తుంది. వర్షాకాలంలో న్యుమోనియా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుంది. ఇది మొదటగా జలుబు, చలితో మొదలవుతుంది. దీనిని నివారించడానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలి.

అలాగే ఈ సీజన్‌లో కొంతమందికి దగ్గు సమస్య కూడా ఉంటుంది. అందుకే వర్షంలో తడవకుండా ఉండాలి. తులసి టీ, అల్లం టీ తాగాలి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వర్షాకాలంలో జాగ్రత్తలు

ఈ సీజన్‌లో శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చేతులు కడుక్కోకుండా ఏమీ తినకూడదు. శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. టాయిలెట్‌కు వెళ్లినప్పుడు చేతులను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. వర్షాకాలంలో రోగాలు చుట్టుముట్టకుండా ఉండాలంటే తగినంత నిద్రపోవాలి. దీనివల్ల ఇమ్యూనిటీ పెరిగి వ్యాధులు దూరంగా ఉంటాయి. కనీసం రోజుకి 8 గంటలు నిద్రపోవాలి. ఇంటి చుట్టు వర్షపు నీరు నిలవకుండా చూసుకోవాలి. లేదంటే దోమలు పెరిగిపోయి డెంగ్యూ, మలేరియాకి కారణమవుతాయి.

Tags:    

Similar News