Health Tips: డ్రైఫ్రూట్స్‌లో జీడిపప్పు వస్తే నోట్లో వేసుకోండి.. కానీ స్పెషల్‌గా తినేవారికి హెచ్చరిక..!

Health Tips: మనం డ్రై ఫ్రూట్స్‌, స్వీట్లు, పాయసం తీసుకున్నప్పుడు అందులో జీడిపప్పు వస్తే ఎంతో ఇష్టంగా తింటాం. నిజానికి జీడిపప్పు కూడా డ్రై ఫ్రూట్స్‌లో ఒక భాగమే.

Update: 2024-05-09 16:00 GMT

Health Tips: డ్రైఫ్రూట్స్‌లో జీడిపప్పు వస్తే నోట్లో వేసుకోండి.. కానీ స్పెషల్‌గా తినేవారికి హెచ్చరిక..!

Health Tips: మనం డ్రై ఫ్రూట్స్‌, స్వీట్లు, పాయసం తీసుకున్నప్పుడు అందులో జీడిపప్పు వస్తే ఎంతో ఇష్టంగా తింటాం. నిజానికి జీడిపప్పు కూడా డ్రై ఫ్రూట్స్‌లో ఒక భాగమే. అయితే రోజుకి నాలుగైదు జీడిపప్పులు తింటే పర్వాలేదు కానీ కొంతమంది స్పెషల్‌గా వీటిని తినడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటివారికి ఇవి పాయిజన్‌తో సమానం. నిజానికి ఏ ఫుడ్‌ అయినా సరే మితంగా తింటే అది ఔషధంగా పనిచేస్తుంది. అధికంగా తింటే అనర్థాలను సృష్టిస్తుంది. ఈ రోజు జీడిపప్పు ఎక్కువగా తినడం వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకుందాం.

జీడిపప్పును ఎక్కువగా తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చ రిస్తున్నారు. ఇందులోని క్యాలరీలు ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. జీడి పప్పు అధిక ఆక్సలేట్ కంటెంట్ కలిగి ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువ పరిమాణంలో తిన్నప్పుడు ఇది మూత్రపిండాల నష్టంతో పాటు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీ స్తుంది. ముడి జీడిపప్పు సురక్షితమైనదికాదు. వేయించిన లేదా కాల్చిన జీడిపప్పు తినటం సురక్షితం.

జీడిపప్పులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తిన్న తర్వాత తక్కువ నీరు తాగితే డీహైడ్రేషన్ కు గురవుతారు. జీడిపప్పులో కేలరీలు ఎక్కువ దీనివల్ల తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని తక్కువగా తీసుకోవడం ఉత్తమం. జీడిపప్పులో పోషకాలు ఎక్కువే. అధిక మోతాదులో అసంతృప్త కొవ్వులు, విటమిన్‌-ఇ, కాపర్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, ఫాస్పరస్‌, విటమిన్‌-కె లాంటివి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యా న్ని కాపాడతాయి. కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించడానికి, బీపీని నియంత్రణలో ఉంచడానికి సాయపడతాయి. ఇందులోని అసంతృప్త కొవ్వులు మెదడును షార్ప్‌గా మారుస్తాయి.

Tags:    

Similar News