Summer Health Tips: ఎండాకాలం అరటిపండ్లు ఎక్కువగా తింటున్నారా.. ఎప్పుడైనా ఈ విషయాలు గమనించారా..!

Summer Health Tips: అరటి పండును పేదోడి పండుగా పిలుస్తారు. ఎందుకంటే ఇది అన్ని సీజన్‌లలో తక్కువ ధరకే లభిస్తుంది. అంతేకాదు ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Update: 2024-05-09 04:47 GMT

Health Tips: ఎండాకాలం అరటిపండ్లు ఎక్కువగా తింటున్నారా.. ఎప్పుడైనా ఈ విషయాలు గమనించారా..!

Health Tips: అరటి పండును పేదోడి పండుగా పిలుస్తారు. ఎందుకంటే ఇది అన్ని సీజన్‌లలో తక్కువ ధరకే లభిస్తుంది. అంతేకాదు ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం అధికంగా లభిస్తాయి. అరటిపండును చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంతో ఇష్టపడుతారు. అంతేకాదు దీనిని తినడం, జీర్ణం చేసుకోవడం చాలా సులభం. అయితే వేసవిలో ప్రతి రోజు తీసుకునే ఆహారంతో పాటు అరటిపండును కూడా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కారణమేంటో ఈ రోజు తెలుసుకుందాం.

బ్రేక్‌ఫాస్ట్‌లో అరటిపండును చేర్చుకుంటే ఉత్తమం. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అరటిపండ్లను మధ్యాహ్న భోజనంలో కూడా చేర్చుకోవచ్చు. ఇవి ఎసిడిటీ, కాళ్ల తిమ్మిరిని నివారిస్తాయి.హైపోథైరాయిడిజంను కంట్రోల్‌ చేస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. సాయంత్రం వరకు శక్తివంతంగా ఉంటారు. గర్భిణీలు ప్రెగ్నెన్సీ సమయంలో తినడం వల్ల అలసట నుంచి ఉపశమనం పొందుతారు. అరటిపండులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, మంచి కొవ్వులు శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పేగు బాగుంటే మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి మీకు మలబద్ధకం సమస్య ఉంటే ప్రతిరోజూ ఒక అరటిపండు తినండి. అలాగే అరటిపండ్లలో ఫ్రక్టోజ్ తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) ను కంట్రోల్‌ చేయడంలో సాయపడుతుంది. పాలు, బ్రెడ్‌తో అరటిపండు తినవచ్చు. ఇది తలనొప్పి,మైగ్రేన్‌ను తగ్గిస్తుంది. పిల్లలకు తినిపించడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది.

Tags:    

Similar News