Coronavirus: రూపం మార్చుకుని వస్తున్న మాయదారి రోగం.. ఈ లక్షణాలుంటే కరోనా ఉన్నట్లే
Coronavirus: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. దాదాపు అన్ని రంగాలపై కరోనా ప్రభావం చూపింది.
Coronavirus: రూపం మార్చుకుని వస్తున్న మాయదారి రోగం.. ఈ లక్షణాలుంటే కరోనా ఉన్నట్లే
Coronavirus: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. దాదాపు అన్ని రంగాలపై కరోనా ప్రభావం చూపింది. అయితే ఈ పేరును మర్చిపోతున్న తరుణంలో మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడమే దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు.
ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం ఇటీవల భారత్‌లో కొత్త వేరియంట్లను గుర్తించింది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో NB 1.8.1, LF.7 అనే వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. ఈ వేరియంట్లు ప్రస్తుతం సింగపూర్‌లో పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నట్టు సమాచారం. దక్షిణ భారత రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ కొత్త కేసులు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
కనిపిస్తున్న ముఖ్య లక్షణాలు:
కొత్త వేరియంట్ బారిన పడిన వారిలో కనిపిస్తున్న పలు ప్రధాన లక్షణాలు ఇలా ఉన్నాయి. జ్వరంతో పాటు తీవ్ర అలసట, శరీర నిస్సత్తువ, జలుబు, దగ్గు, తలనొప్పి, ముక్కు కారడం. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
బయటకు వెళ్లే వారు మాస్క్ ధరించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. గోరువెచ్చని నీరు తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. పిల్లలు, వృద్ధులు ఎక్కువ మంది ఉండే వేడుకలకు వెళ్లకుండ ఉండడం మంచిది. అయితే గతంలో వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ప్రమాదం తక్కువగా ఉందని, కానీ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలు చేసేవారు కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. కరోనా నిర్ధారణ అయితే కనీసం 7 రోజులపాటు క్వారంటైన్ పాటించాలి. 60 ఏళ్లు పైబడిన వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.