Men Health: పురుషులు ఈ చిట్కాలు పాటిస్తే నిత్య యవ్వనంగా ఉంటారు.. అవేంటంటే..?

Men Health: పురుషులు ఈ చిట్కాలు పాటిస్తే నిత్య యవ్వనంగా ఉంటారు.. అవేంటంటే..?

Update: 2022-07-12 15:30 GMT

Men Health: పురుషులు ఈ చిట్కాలు పాటిస్తే నిత్య యవ్వనంగా ఉంటారు.. అవేంటంటే..?

Men Health: ఆధునిక జీవితంలో పనిభారం, ఆహారపు రుగ్మతల కారణంగా పురుషులలో అనేక వ్యాధుల ప్రమాదం పెరిగింది. ఈ పరిస్థితిలో వారు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి. చాలా కాలం పాటు యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పద్దతులని పాటించాలి. ఇందుకోసం ఉదయాన్నే లేవండి. నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ప్రతిరోజూ మీరు 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. వ్యాయామం మీ శరీరంలో శక్తిని నింపుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే జీవక్రియ మెరుగవుతుంది. దీని వల్ల మీ శరీరం చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది.

ఉదయం టిఫిన్‌ మానేయవద్దు. నిద్రలేచిన రెండు గంటలలోపు టిఫిన్‌ చేయాలి. పురుషులు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలని కోరుకుంటే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. అల్పాహారంలో రెండు అరటిపండ్లు, మొలకెత్తిన ధాన్యాలు, పండ్ల రసాలు తీసుకోవచ్చు. ఆఫీసులో లేదా ఇంట్లో లిఫ్ట్‌కు బదులుగా మెట్లను ఉపయోగించండి. ఎక్కడం, దిగడం రెండూ మెట్ల ద్వారానే చేయాలని గుర్తుంచుకోండి. ఆఫీసులో ఫోన్ల వాడకాన్ని తగ్గించండి.

నిరంతరం కార్యాలయంలో కూర్చోవద్దు. ఒత్తిడి మన జీవితంలో చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ కనీసం అరగంట పాటు మంచి నిద్రిన ఆస్వాదించండి. పాటలు వినడం, సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం మొదలైనవి చేస్తే మనసు ఉల్లాసంగా ఉంటుంది. అప్పుడు మీరు ఫిట్‌గా ఉంటారు. తగినంత నిద్ర పొందడం ద్వారా మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు.

Tags:    

Similar News