Cancer: క్యాన్సర్ సైలెంట్‌ కిల్లర్‌.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌..!

Cancer: ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తించడం చాలా కష్టం.

Update: 2022-10-13 11:37 GMT

Cancer: క్యాన్సర్ సైలెంట్‌ కిల్లర్‌.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌..!

Cancer: ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తించడం చాలా కష్టం. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అయితే అప్పటికే చాలా అనర్థం జరిగిపోతుంది. అందుకే క్యాన్సర్‌ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఈ రోజు మనం ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు, చికిత్స విధానం గురించి తెలుసుకుందాం.

ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ఇది చాలా ప్రాణాంతకం. సరైన సమయంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తిస్తే ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడవచ్చు. ఒక నివేదిక ప్రకారం ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో 15 శాతం మాత్రమే మొదటి దశలో చికిత్స చేయవచ్చు. తరువాత కూడా మనుగడ రేటు 54 శాతం మాత్రమే. క్యాన్సర్‌కు ప్రాథమిక దశలోనే చికిత్స అందిస్తే రోగులు ఎక్కువ కాలం జీవిస్తారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు

దగ్గు అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణం. ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో దగ్గు తీవ్రంగా మారుతుంది. ఔషధం తీసుకున్న తర్వాత ఎటువంటి ప్రభావం ఉండదు. ఊపిరితిత్తులలో వాపు, దగ్గుతున్నప్పుడు రక్తం రావడం ప్రారంభమవుతుంది. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఉంటుంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు ఉన్నాయి. మొదటి దశలో ఇది నయమయ్యే అవకాశం ఉంటుంది. నాల్గవ దశలో శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఆ తర్వాత రోగులు జీవించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

Tags:    

Similar News