Alert: అలర్ట్‌.. మీకు తెలియకుండానే ఈ మహమ్మారి ప్రాణాలు తీస్తుంది..!

Alert: ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి అత్యంత ముఖ్యమైన కారణం.

Update: 2023-05-31 13:00 GMT

Alert: అలర్ట్‌.. మీకు తెలియకుండానే ఈ మహమ్మారి ప్రాణాలు తీస్తుంది..!

Alert: అసలే ఈ రోజుల్లో వాతావరణం పూర్తిగా కలుషితం అయిందంటే దానికి తోడు ఈ ధూమాపానం ఒకటి. ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి అత్యంత ముఖ్యమైన కారణం. పొగాకు ఉత్పత్తులకి బానిస అయితే ఎప్పుడైనా ప్రాణాలు పోవచ్చు. ఇదిలా ఉంటే ధూమపానం చేసేవారి చుట్టుపక్కల వారు కూడా ప్రమాదంలో పడుతున్నారు. దీనిని పాసివ్ స్మోకింగ్ అంటారు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

చాలామంది మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి వల్ల పొగాకు ఉత్పత్తులకి బానిస అవుతారు. దీనివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పాటు గుండెపోటు, ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నివేదికల ప్రకారం సిగరెట్ పొగ గాలిలో 5000 కంటే ఎక్కువ రసాయనాలను విడుదల చేస్తుంది. ఈ పొగ గాలిలో చాలా సేపు ఉంటుంది. దీనివల్ల ముందుగా ఆస్తమా బారిన పడుతారు.

గర్భిణీలకి ఎక్కువ ప్రమాదం

ఒక స్త్రీ ధూమపానం చేసేవారికి దగ్గరగా ఉంటే ఆమె మాత్రమే కాదు ఆమెకి పుట్టబోయే బిడ్డకి కూడా చాలా ప్రమాదం. పరిశోధనల ప్రకారం పాసివ్ స్మోకింగ్ కారణంగా పుట్టబోయే బిడ్డ ఊపిరితిత్తులు సరిగ్గా అభివృద్ధి చెందవు. అంతే కాదు పుట్టిన తర్వాత పిల్లలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి.

స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ

ఒక వ్యక్తి పాసివ్ స్మోకింగ్‌లో ఉన్నట్లయితే అతనిలో స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. నివేదికల ప్రకారం పాసివ్ స్మోకింగ్ కారణంగా ఒక వ్యక్తిలో స్ట్రోక్ ప్రమాదం 20 నుంచి 25 శాతం పెరుగుతుంది. కాబట్టి మీరు సిగరెట్ తాగినా తాగకున్నా దాని పొగ కచ్చితంగా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ధూమపానం చేసేవారికి దూరంగా ఉండండి.

Tags:    

Similar News