Health Tips: చిన్న వయసులో గడ్డం తెల్లగా మారడానికి ఇవే కారణాలు..!

Health Tips: పొడవాటి గడ్డం, మీసాలు పెంచుకోవడం ఈ రోజులలో ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.

Update: 2022-11-18 03:46 GMT

Health Tips: చిన్న వయసులో గడ్డం తెల్లగా మారడానికి ఇవే కారణాలు..!

Health Tips: పొడవాటి గడ్డం, మీసాలు పెంచుకోవడం ఈ రోజులలో ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. నటుడైనా, సాధారణ వ్యక్తి అయినా అందరూ ఈ ట్రెండ్‌ని అనుసరిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో ప్రజల జుట్టు చిన్న వయస్సులోనే తెల్లగా మారుతోంది. ఇది యువతకు చాలా చెడుగా కనిపిస్తుంది. నేటి కాలంలో యువకులు తెల్ల జుట్టు నివారణకు రంగులు ఉపయోగించడం ప్రారంభించారు. అంతెందుకు వయస్సు రాకముందే గడ్డం రంగు తెల్లగా మారడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

మెలనిన్ అనేది ఒక వర్ణద్రవ్యం. ఇది కళ్ళు, జుట్టు, చర్మంపై ఉండే జుట్టుకి సహజరంగుని అందిస్తుంది. ఈ వర్ణద్రవ్యం చాలా జీవులలో కనిపిస్తుంది. శరీరంలో దీని లోపం ఏర్పడినప్పుడు జుట్టు, కళ్ళు, చర్మం రంగు ప్రభావితం అవుతుంది. అందుకే ఆహారంలో సిట్రస్ ఫుడ్, బెర్రీలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చేర్చుకోవాలి. ఇది శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

ధూమపానం

చాలా మంది యువకులు ధూమపానం, మద్యం సేవిస్తున్నారు. అతిగా పొగతాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల చిన్న వయసులోనే తల, గడ్డం వెంట్రుకలు తెల్లగా మారుతున్నాయి. దీని కారణంగా వెంట్రుకల కుదుళ్లకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీని కారణంగా గడ్డం రంగు నలుపు నుంచి తెల్లగా మారుతుంది. ఈ పరిస్థితిలో ఆహారంలో విటమిన్ సి, ఇతర పోషకాలను చేర్చాలి. ఇలా చేయడం వల్ల కొంత మెరుగుదలని చూడవచ్చు.

Tags:    

Similar News