మీరు ఉపవాసం ఉంటున్నారా? అయితే..

Update: 2019-05-15 06:45 GMT

నేటి ఆధునిక సమాజంలో చాలా మందిలో ఆధ్యాత్మిక భావనలో ప్రయాణిస్తున్నారు. దైవారాధనలో భాగంగా వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటుంటారు. ఏదీ తినకుండా అలా ఉంటే ఆరోగ్యానికి ప్రమాదం అని కొందరంటే.. వారంలో ఒకరోజు కడుపును డ్రైగా ఉంచడం శ్రేయస్కరమే అని మరికొందరు అంటుంటారు. ఇందులో ఏది నిజం?ఉపవాసం అనేది మనిషికి ముప్పు కలిగించేదా లేక మంచి చేసేదా! అనే దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం...

దేవుడు పేరుతో కానీ డైట్ పరంగా కానీ ఉపవాసం చాలా మందికి అలవాటైన ఆచరణ. వారంలో ఒకరోజు ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఫాస్టింగ్ వల్ల జీర్ణక్రియకి విశ్రాంతి లభిస్తుంది. దీంతో జీవక్రియలు సరైన రీతిలో జరుగుతాయని వైద్యులు అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఉపవాపం ఉన్నప్పుడు శరీరంలో జరిగే మార్పులపై పరిశోధనలు జరిపారు. వారంలో కానీ పక్షంలో కానీ ఉపవాసం చేయడం ద్వారా చురుకుగా ఉండడంతో పాటు ఆయుష్షు పెరుగుతుందని తెలిపారు. ఆ సమయంలో నీరు ఎక్కువగా తాగడం వల్ల మెదడు పని తీరు బాగుంటుందని పరిశోధకులు తేల్చారు.

యుక్త వయసులో ఉన్నవారు ఉపవాసం మంచిదని.. దీని ద్వారా వారిలో ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతుందని తెలిపారు. అలాగే జ్ఞాపకశక్తి.. ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. సాధారణ వ్యాదులైన జలుబు, దగ్గు.. నయమవుతాయని కాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయని వెల్లడించారు. ఉపవాసం చేసే ముందు ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, ఆరోగ్యం బాగలేనివారు ఉపవాసం చేయకూడదని నిపుణులు అంటున్నారు. 

Similar News