Shopping Tips: షాపింగ్‌ చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే చాలా సేవ్‌ చేస్తారు..!

Shopping Tips: చాలామంది షాపింగ్‌ చేసేటప్పుడు విపరీతమైన తప్పులు చేస్తారు. దీనివల్ల సమయంతో పాటు చాలా డబ్బు కూడా వృథా అవుతుంది.

Update: 2024-03-07 16:00 GMT

Shopping Tips: షాపింగ్‌ చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే చాలా సేవ్‌ చేస్తారు..!

Shopping Tips: చాలామంది షాపింగ్‌ చేసేటప్పుడు విపరీతమైన తప్పులు చేస్తారు. దీనివల్ల సమయంతో పాటు చాలా డబ్బు కూడా వృథా అవుతుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌, శుభకార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి షాపింగ్‌ ఏ విధంగా చేయాలి. మనీ ఏ విధంగా సేవ్‌ చేయాలి తదితర షాపింగ్‌ చిట్కాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ముందుగా బడ్జెట్‌ వేసుకోవాలి

షాషింగ్‌ వెళ్లడానికి మందు బడ్జెట్‌ నిర్ణయించుకోవాలి. దానికి మించి ఒక్క పైసా ఖర్చు చేయకూడదు. బడ్జెట్‌లోనే అన్ని వస్తువులు తీసుకురావడానికి ప్రయత్నించాలి. కంపెనీలు, ఆన్‌లైన్‌లో ఉండే ఆఫర్లను చూసి టెమిట్‌ కాకూడదు. లిమిట్‌లో వచ్చే బెస్ట్‌ వాటిని కొనుగోలు చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి.

ముందుగానే జాబితా

షాపింగ్‌ వెళ్లేటప్పుడు ముందుగానే జాబితా సిద్దం చేసుకోవాలి. కావాల్సిన వస్తువులు సీరియల్‌ నెంబర్‌ ప్రకారం ఒక పేపర్‌లో రాసుకోవాలి. చాలామంది రిటైలర్లు వ్యూహాత్మకంగా క్యాష్‌ / చెక్‌అవుట్‌ కౌంటర్ల వద్ద ఆకర్షణీయ వస్తువులను ప్రదర్శనలో ఉంచుతారు. వాటిపై దృష్టి కేంద్రీకరించకపోవడమే మంచిది. లిస్ట్‌లో రాసుకున్నవాటినే కొనుగోలు చేయడం వల్ల మీకు సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుంది.

ధరలను పోల్చి చూడాలి

షాపింగ్‌ చేసేటప్పుడు వివిధ షాపులలో ఉండే వస్తువుల ధరలను పోల్చి చూడాలి. దీనివల్ల మీకు కావాలసిన వస్తువులు తక్కువ ధరకు లభించే అవకాశాలు ఉంటాయి. కొన్ని పేరున్న దుకాణాల్లో, ఆన్‌లైన్‌ రిటైలర్స్‌ వద్ద కొన్ని రోజులలో ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. ఎక్కువ కొనుగోలు చేసినప్పుడు డిస్కౌంట్స్‌ మరింతగా ఉండొచ్చు. కాబట్టి, ధరల విషయంలో వివిధ షాపుల రేట్లను పోల్చి చూడాలి.

ఉదయాన్నే షాపింగ్‌ చేయాలి

ఉదయం వేళలలో షాపింగ్‌ చేయడం కొనుగోలుదారులకు కలిసివస్తుంది. రద్దీ ఎక్కువ ఉండదు కాబట్టి దుకాణదారులు ఎక్కువ ఐటెమ్స్‌ను విసుగు లేకుండా చూపిస్తారు. బేరమాడడానికి సమయం ఉంటుంది. కొన్ని దుకాణాలలో ఎక్కువ జనాదరణ పొందిన వస్తువులు త్వరగా అయిపోతాయి. ఉదయం వెళ్లడం వల్ల వాటిని సులువుగా కొనుగోలు చేయవచ్చు.

పెద్ద మొత్తంలో కొనుగోళ్లు

ఏవైనా కొన్ని రకాల వస్తువులు పెద్ద మొత్తంలో అవసరమైతే రిటైల్‌ షాప్‌లో కాకుండా హోల్‌సేల్‌ షాపులలో కొనుగోలు చేయాలి. దీనివల్ల డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా తక్కువ ధరలో ఎక్కువ మొత్తం ఇంటికి తీసుకురావచ్చు.

నగదు..

చాలా మంది షాపింగ్‌ సమయంలో డెబిట్‌ / క్రెడిట్‌ కార్డులను, యూపీఐ ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఎంత చెల్లిస్తున్నామో తెలియకుండా పోతుంది. అందుకే షాపింగ్‌ చేసేటప్పుడు నగదను తీసుకెళ్లాలి. దీనివల్ల చేతి నుంచి డబ్బులు ఖర్చవుతున్నప్పుడు తక్కువగా ఖర్చు చేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది.

Tags:    

Similar News