వెజ్ హలీమ్ తయారీ ఎలా?
కావాల్సినపదార్ధాలు
గోధుమరవ్వ : అరకప్పు
ఓట్స్ : రెండు టేబుల్‌స్పూన్లు
ఎర్రకందిపప్పు: టేబుల్ స్పూన్
పెసరపప్పు : టేబుల్ స్పూన్
మినపప్పు: టేబుల్ స్పూన్
నువ్వులు : టేబుల్ స్పూన్
మిరియాలు : పావు టీస్పూను
యాలకులు : మూడు
లవంగాలు : నాలుగు
దాల్చినచెక్క : చిన్నముక్కలు రెండు
జీలకర్ర : ఒక టీస్పూను
సోయా వాటర్ గ్రాన్యూల్స్ : పావు కప్పు
బాదంపప్పులు : టేబుల్‌స్పూను
జీడిపప్పు : టేబుల్‌స్పూను
ఉల్లిపాయలు : రెండు
క్యారెట్, బీన్స్, పచ్చిబటాణీ గింజలు, గ్రీన్ బీన్స్ : అరకప్పు
పాలు : అర కప్పు
పచ్చిమిర్చి : మూడు
పుదీనా, కొత్తిమీర - ఒక్కొక్కటీ
ఉప్పు : సరిపడినంత
ముందుగా గోధుమరవ్వ, ఓట్స్ , ఎర్రకందిపప్పు, పెసరపప్పు, మినపప్పు,నువ్వులు , మిరియాలు, యాలకులు, లవంగాలు , దాల్చినచెక్క, జీలకర్ర ను మిక్సిలో గ్రైండ్ చేసి పొడిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇఫ్పుడు కడాయి తీసుకుని రెండు టేబుల్స్పూన్ల నూనె అందులో వేయాలి. వేడెక్కిన నూనెలో తరిగిపెట్టుకున్న ఉల్లిపాయముక్కల్ని వేసి బ్రౌన్ రంగులో వచ్చేవరకూ వేగించి ఒక ప్లేటులో పోయాలి. ప్రెషర్ కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసి అందులో జీడిపప్పును బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వే సి వేగించాలి. ఇందులో వేగించిన ఉల్లిపాయలను కూడా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి. మిక్స్డ్ వెజిటబుల్స్ కూడా ఇందులో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.
నానబెట్టిన సోయా గింజల్లోని నీళ్లను తీసేసి ప్రెషర్కుక్కర్లో వేసి ఒక నిమిషం ఉడకనివ్వాలి. అందులో పాలు కూడా మరగనివ్వాలి. తర్వాత మూడు కప్పుల నీళ్లు అందులో పోసి పుదీనా, కొత్తిమీర వేయాలి. రెడీ చేసి పెట్టుకున్న పొడిని, రుచికి సరిపడా ఉప్పును కూడా ఇందులో వేసి ఉండ కట్టకుండా కలపాలి. ఈ మిశ్రమం మరుగుకు వచ్చే వరకు ఉంచి కుక్కర్‌పై మూతపెట్టి 15 నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి. ఆవిరి తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి అందులోని మిశ్రమాన్ని మాషర్‌తో మెత్తగా చేయాలి. ఇలా రెడీ అయిన వెజ్ హలీమ్‌పై పుదీనా, కొత్తిమీర తరుగు, నిమ్మకాయముక్కలు, వేగించిన నట్స్‌లతో అలంకరించి సర్వ్ చేయాలి.