వేడి నీరు త్రాగితే బరువు తగ్గే ఛాన్స్.. ఎలాగంటే..

Update: 2019-05-25 16:48 GMT

మనిషి మనుగడకు నీరు చాలా అవసరం. ప్రతి మనిషి రోజులో కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి అని వైద్యులు చెబుతుంటారు. 8 నుంచి 12 గ్లాసుల వరకు నీరు త్రాగితే ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు సూచిస్తారు. అదే క్రమంలో రోజుకో గ్లాసు వేడి నీరు సైతం మనిషి ఆరోగ్యాన్ని పదిలపరుస్తుంది. ప్రతి రోజు ఉదయాన్నే నిద్రలేచిన తరువాత ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు గనక త్రాగినట్టయితే శరీరంలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు ఉంటాయని వారంటున్నారు. అందులో కొన్ని ఇలా ఉన్నాయి.

1. బరువు తగ్గే ఛాన్స్

స్థూలకాయంతో ఇబ్బందిపడేవారు బరువు తగ్గడంకోసం రోజు చేసే పనులతో పాటుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగితే సులువుగా బరువు తగ్గొచ్చని అంటున్నారు. అలాగే వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగితే. శరీరంలో కొవ్వు కణజాలం విచ్చిన్నం అవుతుంది తద్వారా వేగంగా బరువు తగ్గే అవకాశముంది.

2. గొంతు సమస్యలు దూరం

వేడి నీరు సేవించడం వలన కలిగే ప్రయోజనాల్లో మరొకటి గొంతు నొప్పి నివారణ. వేడి నీరు ఈ సమస్యకు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు, కఫం కరిగించి శ్వాసనాళం నుండి తొలగిస్తుంది. దాంతో గొంతుకు ఉపశమనం కలిగి గొంతు సమస్యలు దూరమవుతాయి.

3. కాంతివంతగా శరీరం

వేడి నీరు త్రాగితే కలిగే ప్రయోజనాల్లో మరో ముఖ్యమైనది చర్మం కాంతివంతగా ఉండటం. అంతేకాక దెబ్బతిన్న చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

4. రక్త ప్రసరణ మెరుగు

వేడి నీటిని ప్రతిరోజు త్రాగటం వలన రక్త ప్రసరణ మెరుగవుతుంది. అలాగే నాడీ కణాలు వ్యవస్థ పేరుకుపోయి కొవ్వును వేడి నీరు కరిగిస్తుంది. తద్వారా నాడీ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేస్తుంది. 

Similar News