ఎండ వేడికి మసాలా మజ్జిగ

Update: 2019-05-25 14:32 GMT

వేసవిలో మండే ఎండలనుండి శరీరాన్ని కాపాడుకోవడానికి మజ్జిగ బాగా ఉపయోగపడతాయి. .ఎండనపడి ఇంటికి రాగానే చల్లచల్లగా మజ్జిగ తాగేస్తే ఆ మజానే వేరు. అయితే కొందరు కేవలం మజ్జిగ మాత్రమే తాగడానికి ఇష్టపడరు అందులో మసాలా వేసుకొని తాగుతారు. ఇలా తాగడం వలన ఏదో తిన్న అనుభూతి కూడా కలుగుతుంది.

మసాలా మజ్జిగ కోసం కావలసిన పదార్ధాలు :

పెరుగు: ఒక కప్ , చల్లని నీళ్ళు: ఒక కప్. అల్లం తురుము: ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి తురుము: ఒక టేబుల్ స్పూన్ , కొత్తమీర తరుగు: ఒక టేబుల్ స్పూన్ , వేయించిన జీలకర్ర: ఒక టేబుల్ స్పూన్. కరివేపాకు తరుగు: ఒకటిన్నర టేబుల్ స్పూన్ , ఉప్పు: రుచికి తగినంత ఎండుమిర్చి: 1(మధ్యకు చీరాలి)..

తయారు చేయు విధానం:

1. ముందుగా చల్లని నీళ్లు పోసి పెరుగును బాగా చిలకాలి. (మీక్సీలో వేసి చిలికితో రుచిలో తేడా వస్తుంది. చిక్కగా తయారవుతుంది)

2. తర్వాత అల్లం తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, నల్లమిరియాలు, కరివేపాకు, ఉప్పు వేసి కలపాలి.

3. అంతే మసాలా అంజి మోర్ రెడీ. సర్వ్ చేసే ముందు కొత్తిమీర, వేయించి క్రష్ చేసిన జీలకర్ర, ఎండుమిర్చితో గార్నిష్ చేయాలి. ఆ తరువాత అందులో పుదీనా, కొత్తిమీర, జీలకర్ర , మిరియాలు వేయాలి.. దాంతో మసాల మజ్జిగ రెడీ అయిపోతోంది.  

Similar News