యాపిల్ గింజలు తింటే ప్రాణానికే ప్రమాదమట!

Update: 2019-05-17 15:54 GMT

యాపిల్ అంటే అందరికి ఇష్టం. ఈ ఫ్రూట్ ఇష్టపడని వారు తక్కువగా ఉంటారు. యాపిల్ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతుంటారు. అనారోగ్యంతో ఉండేవారు రోజుకో యాపిల్ తింటే కోలుకుంటారని చెబుతుంటారు. అయితే యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిదే కానీ యాపిల్ గింజలను తింటే మాత్రం ప్రమాదకరమనే అంటున్నారు. యాపిల్ కోసుకొని తిన్నప్పుడు దాంట్లో ఉండే గింజలను తీసి పారేస్తూ ఉంటారు. తెలియకపోయినా చాలామంది ఆ గింజల్ని తినడానికి ఇష్టపడరు. అయితే యాపిల్స్‌‌ గింజల్లో అమాక్డాలిన్ అనే పదార్థం ఉంటుంది. గింజలను నమిలినప్పుడు ఆ పదార్థం హైడ్రోజన్ సైనైడ్ గా మారుతుంది..

దీంతో రక్తంలో కలిసి శ్వాసకోశ సంబంధ సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. శరీరంలో రక్తం పై నుండి కింది వరకు ఆక్సిజన్ను సరఫరా చేస్తూ ఉంటుంది. ఆ సరఫరా ఈ ఆపిల్ గింజలని నమలడం వలన వచ్చే హైడ్రోజన్ సైనేడ్ వలన ఆ ఆక్సిజన్ తీసుకువెళ్లే సామర్ధ్యం తగ్గిపోతుంది. దీని కారణంగానే మనిషిలో శ్వాసక్రియకు సంభంధించిన సమస్యలు సంభవిస్తాయి.. అలాగే ఎక్కువ మోతాదులో తిన్నప్పుడు ప్రాణాంతకంమని చెబుతున్నారు నిపుణులు. అందువలన ఇష్టంగా యాపిల్ తింటే తిన్నారుగాని గింజలను మాత్రం తినరాదని సూచిస్తున్నారు.

Similar News