అలా అనిపిస్తే.. 15 నిమిషాలు ఇలా చేయండి...

Update: 2019-05-16 09:22 GMT

ఎవరికైనా మనసు చిరాకుగా అనిపిస్తే అసలేమి పని చేయాలనిపించదు. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే కొంత మందికి చిరాగ్గా, అలసటగా ఉంటుంది. చాలామందికి చిరాకు పడటానికి నిద్ర కారణం అవచ్చు. కంటికి సరిపడినంతా నిద్ర లేకపోతే చిరాకుగా, చాలా అసహనంగానే ఉంటారు. మరి మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఓ 15 నిమిషాలు ఇలా చేయండి.

* బ్రిస్క్ వాక్

* సైక్లింగ్

* స్విమ్మింగ్

వీటిలో ఏదైనా ఓ వారం పాటు 15 నిమిషాలు చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీటితో పాటు రోజు క్రమం తప్పకుండా కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే మనసు నిలకడగా, ఏకగ్రతగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.   

Similar News