మసాల ఛాయ్ తాగుతున్నారా..!

మసాల ఛాయ్ తాగుతున్నారా..! మసాల ఛాయ్ తాగుతున్నారా..!

Update: 2019-09-27 07:49 GMT

ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్. ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్.. అంటూ ఓ సినీ గేయ రచయిత చెప్పినట్లు.. ఛాయ్ తాగితే వచ్చే ఉత్సాహమే వేరు అంటున్నారు టీ ప్రేమికులు. చాలమందికి గొంతులో ఛాయ్ పడందే దినచర్య మొదలు కాదు. ఇక ఛాయ్‌లు మీద ఛాయ్‌లు లాగించేవారు ఉన్నారు. చల్లటి చిరు జల్లులు పడే సమయంలో వేడీ వేడీ ఛాయ్ తాగితే ఉండే మజానే వేరు అంటున్నారు టీ లవర్స్.

అయితే టీ లో చాల రకాలు ఉన్నా బరవు తగ్గాలనుకునే వారు మాత్రం ఎక్కువగా గ్రీన్ టీ తాగుతుంటారు. ఘాటుగా, టేస్టీగా ఉండే మసాలా ఛాయ్‌ తాగినా క్యాలరీలు ఖర్చవుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిలోని మసాలా దినుసులు క్యాలరీలను కరిగిస్తాయి అంటున్నారు నిపుణులు. అంతేకాదు తలనొప్పి, గొంతు నొప్పి వంటి సమస్యలకు మసాలా ఛాయ్ చక్కటి పరిస్కారం అంటున్నారు నిపుణులు.

ఈ మసాలో ఛాయ్ ముఖ్యంగా ఉండాల్సినవి.. లవంగాలు, నల్లమిరియాలు, సోంపు గింజలు, దాల్చిన చెక్క. వీటిని ముందుగా వేగించాలి. తరువాత కొంచెం అల్లం పొడి వేసి కలపాలి. చల్లారిన తర్వాత వీటిని మెత్తని పొడిగా చేయాలి. ఇక ఈ మిశ్రమాన్ని టీలో వేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఛాయ్ లో ఈ మిశ్రమం సగం టేబుల్‌ స్ఫూన్ వేస్తే సరిపోతుంది. ఇలా చేసిన మసాలా ఛాయ్ తాగితే అనేక ఆరోగ్య సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

Tags:    

Similar News