మిస్టరీ.. అక్కడ నీళ్లు ఎందుకు అలా..

Update: 2019-05-14 06:22 GMT

రెండు సముద్రాల కలయిక ఓ వింత. ఇది మనుషులు సృష్టించిన అద్భుతం కావు. ప్రకృతి ప్రసాదించిన వరం. పరిశోధకులకు సైతం అంతుచిక్కనిది. చూసేవారికి కనువిందు చేస్తూ.. అద్భుత అనుభూతిని పంచుతున్న.. గల్ఫ్ ఆఫ్ అలస్కా దగ్గర రెండు మహాసముద్రాలు కలయిక నిజంగా ఓ వింతే. సముద్రాలు కలయిక ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా.. ఇక్కడ రెండు మహాసముద్రాలు కలుస్తాయి కానీ.. నీరు మాత్రం కలువదు.

ఒకవైపు హిందూ మహాసముద్రం, మరోవైపు పసిఫిక్ మహాసముద్రం. ఈ రెండు సముద్రాలు గల్ఫ్ ఆఫ్ అలస్కా దగ్గర కలుస్తాయి. కానీ ఈ రెండు మహాసముద్రాల నీళ్లు ఒకదానితో మరొకటి కలువకపోవడం మిస్టరీ. సాధారణంగా నీళ్లు ఎలా ఉన్నా.. వేరే నీటితో ఇట్టే కలిసిపోతాయి. అక్కడ రెండు సముద్రాల నీళ్ల రంగు వేర్వేరుగా ఉంటుంది. ఒక నీరు లేత నీలం రంగులో కనిపిస్తే.. మరో నీటి రంగు ముదురు నీలంగా ఉంటుంది. ఈ రెండు మహాసముద్రాలు కలిసే చోట ఒక నురగ అడ్డుగోడగా ఏర్పడుతుంది. అక్కడ రెండింటి విభజన రేఖను సృష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఎందుకు అలా ఉందో పరిశోధకులకు ఇంకా రీసెర్చ్ చేస్తునే ఉండటం మరో విశేషం.

Similar News