యూత్ జాగ్రత్త.. లేటుగా పెళ్లి చేసుకుంటే ఇక అంతే!

Update: 2019-05-14 06:15 GMT

పురుషులు లేటుగా పెళ్ళి చేసుకుంటే సంతాన పరమైన సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. త్వరగా పెళ్లి చేసుకొని సంసార జీవితాన్ని మెుదలు పెట్టాలని సూచించింది. లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. వయసు పెరిగే కొద్దీ మహిళలలో గర్భం దాల్చే ఛాన్స్‌లు ఎలాగైతే తగ్గుతాయె అలాగే పురుషుల్లో కూడా అలాంటి సమస్యలే వస్తాయని రిపోర్ట్ తెలిపింది. లేటుగా పిల్లలు కనడం ద్వారా వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుందని వెల్లడించింది. దాంతో యువత తొందరగా పెళ్లి చేసుకోవడం ఉత్తమని లేదంటే సంతాన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఈ పరిశోధనల్లో మగవారు ఎంత వయసు దాటితే వారి సంతానంపై ప్రభావం ఉంటుందనే విషయం మీద స్పష్టత రాలేదు. అయితే 35-45 దాటిన వారిలో ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 45 ఏళ్లు దాటిన పురుషుల్లో సంతానోత్పత్తి సామర్ధ్యం దాదాపుగా తగ్గిపోతుందని, ఆ సమయంలో ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికన్ల పరీశోధకుల అధ్యయనంలో వెల్లడిడైంది. అలాగే మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్ది డయాబెటిస్. బీపీ లాంటి వాధ్యుల కారణంగా నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయట.

లేటు వయసులో దంపతులు పిల్లలను కనాలి అనుకోవడం వల్ల పుట్టబోయే వారు బరువు తక్కువగా ఉండటం, ప్రసవానికి ముందే చనిపోవడం, అనారోగ్యం, గుండె జబ్బులు, మొర్రి తదితర జబ్బుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారు ఎదుగుతున్న సమయంలో క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు ఎక్కువ కావడంతోపాటు, మానసిక సమస్యలు కూడా వస్తాయని పరిశోధకులు వివరించారు. 25 ఏళ్ల వయసు ఉన్న వయసున్న తండ్రికి.. 47 ఏళ్ల వయసులో తండ్రికి పుట్టిన పిల్లలను పరిశిలించగా తక్కువ ఏజ్ ఉన్న ఫాదర్ పుట్టిన పిల్లల్లో చురుకుదనం,ఎదుగుదల ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Similar News