Health Tips: మెంతికూరలో ఆయుర్వేద గుణాలు బోలెడు.. మహిళలకు ఈ ప్రయోజనాలు..!

Health Tips: మనం ప్రతిరోజు వండుకునే వంటల్లో కచ్చితంగా మెంతులు వాడుతుంటాం. వీటివల్ల కూరలకు రుచి పెరుగుతుంది.

Update: 2024-03-05 16:00 GMT

Health Tips: మెంతికూరలో ఆయుర్వేద గుణాలు బోలెడు.. మహిళలకు ఈ ప్రయోజనాలు..!

Health Tips: మనం ప్రతిరోజు వండుకునే వంటల్లో కచ్చితంగా మెంతులు వాడుతుంటాం. వీటివల్ల కూరలకు రుచి పెరుగుతుంది. అలాగే మెంతికూరలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. అయితే మెంతులు, మెంతికూరలో ఆయుర్వేద గుణాలు దాగి ఉంటాయి. వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మెంతి ఆకుల్లో కెలొరీలు తక్కువగా ఉంటాయి. కానీ శరీర ద్రవాల్లో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని ఎంపిక. వీటిని రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉండటమే కాకుండా గుండెల్లో మంట వంటి లక్షణాలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటాసిడ్‌లు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

మెంతికూరలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ, సి, బీటా కెరొటిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చెడుకొవ్వులతో పోరాడి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఇన్సులిన్‌ పనితీరు మెరుగు పరుస్తాయి. ఈ ఆకు కూర కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలోనూ కీలకంగా పనిచేస్తుంది. బాలింతల్లో పాల ఉత్పత్తిని ప్రేరేపించే గుణాలు మెంతి కూరలో పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రసవానంతరం బిడ్డకు సరిపడ పాలు పడనప్పుడు రోజూ కప్పు మెంతికూరను అన్నంతో నైనా, చపాతీలో కలిపి తిన్నా, పొడిలా వాడినా చాలా ప్రయోజనం ఉంటుంది.

Tags:    

Similar News