Face washes: ఖరీదైన ఫేస్ వాష్‌లు వాడి విసిగిపోయారా? అయితే అతి చౌకైన..మంచి గ్లోని ఇచ్చేఈ ఫేస్‌వాష్‌లు ట్రై చేయండి

Face washes: చాలామండి డబ్బు ఎక్కువ పెట్టి ఫేస్ వాష్‌లు కొంటుంటారు. అయితే వీటివల్ల లాభం ఉండకపోగా.. మన జేబులను చిల్లు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ కాలంలో ఫేస్‌వాష్‌లు తరచూ వాడాలి.

Update: 2025-07-21 16:55 GMT

Face washes: ఖరీదైన ఫేస్ వాష్‌లు వాడి విసిగిపోయారా? అయితే అతి చౌకైన..మంచి గ్లోని ఇచ్చేఈ ఫేస్‌వాష్‌లు ట్రై చేయండి

Face washes: చాలామండి డబ్బు ఎక్కువ పెట్టి ఫేస్ వాష్‌లు కొంటుంటారు. అయితే వీటివల్ల లాభం ఉండకపోగా.. మన జేబులను చిల్లు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ కాలంలో ఫేస్‌వాష్‌లు తరచూ వాడాలి. లేదంటే చర్మం పాలిపోతుంది. ట్యాన్‌గా మారి మచ్చలు, పింపుల్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎక్కువ డబ్బుపెట్టి మరీ ఫేస్ వాష్‌లు కొంటుంటారు. కానీ ఇంట్లో చేసే కొన్ని రకాల ఫేస్ వాష్‌లు వాడితే అందానికి అందం, తేజస్సుకు తేజస్సు మీ సొంతం అవుతుంది.

శనగపిండి

ఒక చిన్నపాటి బాటిల్‌లో శనగపిండి వేసుకుని ఉంచుకోవాలి. ప్రతి రోజు బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ శనగపిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని, కాస్త పాలు లేదా నీళ్లు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆ తర్వాత 5 నిమిషాలపాటు ఆగి ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటూ కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపైనున్న మచ్చలు పోవడమే కాకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది.

బియ్యంపు పిండి

శనగపిండిలానే వారంలో రెండు రోజులు బియ్యపు పిండిలో కాస్త పాలు లేదా నీళ్లు వేసి ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. అయితే ఈ పిండిని ముఖంపైన ఎక్కువగా రబ్ చేయకూడదు. ఎక్కువ రబ్ చేస్తే ర్యాషెస్ వస్తే ప్రమాదం ఉంటుంది. అందుకే నెమ్మదిగా నీళ్లు పోసి కడిగితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మలినాలు శుభ్రం అవుతాయి.

ముల్తానీ బట్టి

ముల్తానీ బట్టిని ఇంట్లో పెట్టుకుంటే ఫేషియల్స్ చేయించుకునే అవసరం ఉండదు. ఎందుకంటే ఇది ముఖాన్ని కాంతివంతగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పౌడర్‌‌లో కాస్త నీళ్లు పోసి ముఖానికి అప్లై చేస్తే చాలు ఒక పదినిమిషాల తర్వాత కడిగిస్తే.. మీ ఫేస్‌లో గ్లో వస్తుంది. వారానికి ఏడు రోజులు దీన్ని ముఖాన్ని పెట్టుకుని ఏమీ కాదు.

పాలు, నిమ్మరసం

ఇంటికి వచ్చిన వెంటనే పాలు, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ముఖాన్ని లైట్ మసాజ్ చేయాలి. ఆ తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ట్యాన్ పోవడమే కాకుండా చర్మం మెరిసిపోతుంది. వారానికి నాలుగుసార్లు ఇలా చేస్తే నల్లగా ఉన్న చర్మం కూడా తెల్లగా మారుతుంది.

బియ్యపు నీళ్లు

బియ్యాన్ని ఉడకబెట్టిన తర్వాత వచ్చే గంజినీళ్లను భద్రంగా ఫ్రిజ్‌లో దాచుకోవాలి. ఈ నీటిని అప్పుడప్పుడు ముఖానికి రాసుకోవాలి. ఒక పదినిమిషాల తర్వాత జెంట్ల్ మసాజ్ చేస్తే ముఖం మెరిసిపోతుంది. వారానికి ఒక నాలుగు సార్లు ఇలా చేస్తే చర్మం డల్‌గా ఉండకుండా మెరుస్తుంది.

Tags:    

Similar News