Stomach Cancer: ఉద‌యం లేవ‌గానే క‌డుపులో ఈ స‌మ‌స్య‌లా.? క్యాన్స‌ర్‌కు సంకేతం కావొచ్చు.

Stomach Cancer Symptoms: భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు.

Update: 2025-05-23 16:30 GMT

Health: ఉద‌యం లేవ‌గానే క‌డుపులో ఈ స‌మ‌స్య‌లా.? క్యాన్స‌ర్‌కు సంకేతం కావొచ్చు.

Stomach Cancer Symptoms: భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. మారుతోన్న జీవ‌న విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కార‌ణంగా క్యాన్స‌ర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవ‌ల ఎక్కువ‌గా న‌మోద‌వుతోన్న క్యాన్స‌ర్ కేసుల్లో స్ట‌మ‌క్ క్యాన్సర్ ఒక‌టి.

అయితే స్ట‌మ‌క్ క్యాన్స‌ర్‌ను కొన్ని ముందుస్తు ల‌క్ష‌ణాల ఆధారంగా ముందుగానే గుర్తించ‌వ‌చ్చు. మ‌రీ ముఖ్యంగా ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే క‌డుపులో క‌నిపించే కొన్ని ల‌క్ష‌ణాలు దీర్ఘ‌కాలంలో క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు సంకేతంగా భావించాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఇంత‌కీ ఆ ల‌క్ష‌ణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌లం రంగు మార‌డం:

ఉదయం టాయిలెట్‌కి వెళ్లినప్పుడు మలంలో ఎర్రటి రక్తం కనిపించడమో, లేదా మలం నల్లగా, జిగురుగా ఉండడమో గమనిస్తే అది ప్రమాద సూచకంగా భావించాలి. ఇది కడుపులో ఉన్న కేన్సర్ ముద్ద గడ్డ నుంచి వచ్చే రక్తస్రావానికి సంకేతం కావొచ్చు. ఇది సాధారణ లక్షణం కాదు. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

నిరంత‌రం క‌డుపు నొప్పి:

కడుపు పైభాగంలో నొప్పి అనుభవించడమూ, అది రోజు రోజుకూ పెరగడమూ స్టమక్ క్యాన్సర్‌కు హెచ్చరిక కావచ్చు. ఈ నొప్పి ఒకే చోట ఉండవచ్చు లేదా మొద్దుబారినట్టుగా, సూదితో గుచ్చినట్టుగా ఉండవచ్చు. సాధారణ గ్యాస్ట్రిక్ లేదా అజీర్ణ‌ సమస్యలా అనిపించవచ్చు గానీ అది అంత తేలికగా తీసుకోరాదు.

ఆకలి తగ్గిపోవడం:

ఇటువంటి లక్షణం గమనిస్తే, అది కడుపులో కణితి పెరుగుతున్న సూచన కావొచ్చు. ఆకలి లేకపోవడం లేదా తిన్న వెంటనే పొట్ట నిండిపోయిన భావన కలగడం సాధారణం కాదు. ఇది కూడా క్యాన్స‌ర్ సంకేతం కావొచ్చు.

అకస్మాత్తుగా బరువు తగ్గడం

ఎలాంటి డైటింగ్ లేక‌పోయినా, వ్యాయామం చేయ‌క‌పోయినా ఉన్న‌ట్లుండి బరువు తక్కువవుతున్నట్లయితే అది ప్రమాద సంకేతం. ఎందుకంటే క్యాన్సర్ కణాలు శరీరంలోని పోషకాలు తగిన విధంగా గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా బరువు త‌గ్గిపోతారు.

తరచూ కడుపు ఉబ్బటం, గ్యాస్ సమస్యలు

శరీరంలో తరచూ గ్యాస్, ఉబ్బరం అనిపిస్తే కూడా అప్రమత్తంగా ఉండాలి. నిజానికి ఇది జీర్ణ సంబంధిత స‌మ‌స్య అయినా దీర్ఘ‌కాలం కొన‌సాగితే మాత్రం వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాలి.

Tags:    

Similar News