నిలబడి నీరు తాగుతున్నారా..!

Update: 2019-05-21 03:55 GMT

నిలబడి నీరుతాగుతున్నారా అయితే రోగాలు మీ వెంట వచ్చి నట్లే అంటున్నారు నిపుణులు. అందేంటీ నిలబడి వాటర్ తాగాతే రోగాలు ఎలా వస్తాయా.. అని అనుకుంటున్నారా.. ! అవును నిజం.. పరుగెత్తి పాలు తాగే కన్నా.. నిలబడి నీళ్లు తాగడం మంచిది అంటారు. కానీ ఇప్పుడు నిలబడి నీరు తాగడం మంచిది కాదంటూన్నారు శాస్ర్తవేత్తలు. వాటర్ ని ఖచ్చితంగా కూర్చుని తాగాలంటున్నారు. నిలబడి వాటర్ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.

పొద్దున్న లేస్తే ఉరుకుల పరుగుల జీవితం, నైట్ డ్యూటీలు, సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం, పని ఒత్తిడి కొన్ని రోగాలకు కారణమైతే.. నిలబడి నీరు తాగడం మరికొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ఈ బిజీ లైఫ్ లో వాటర్ ని ప్రశాంతంగా త్రాగని వారున్నారు. అయితే నీటిని నిలబడి తాగొద్దని సూచిస్తున్నారు నిపుణులు. ప్రశాంతంగా కూర్చుని తాగాలని అంటున్నారు. ఎందుకుంటే నిలబడి తాగిన నీరు ఒక్కసారిగా ఆహార గొట్టం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. దీనివల్ల చాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అజీర్తి, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. నిలబడి నీరు తాగడం వల్ల కిడ్నీలకు నీరు అందదు. దీంతో మూత్రాశయ సమస్యలు, కిడ్నీల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యంగా నిలబడి నీరు తాగడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రబావం ఉంది. ద్రవాల సమతుల్యత దెబ్బతిని, కీళ్ళల్లో ఎక్కువ ద్రవాలు చేరి ఆర్థరైటీస్, కీళ్ళవాతం వంటి సమస్యలకు కూడ దారితీస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా వాటర్ ని నిలబడి తాగొద్దు.. ప్రశాంతంగా కూర్చుని తాగాలని సూచిస్తున్నారు నిపుణులు. 

Similar News