కలలో డబ్బు కనిపిస్తే శుభమా? అశుభమా? – స్వప్నశాస్త్రం ఏమంటుందంటే…

మన కలల్లో కొన్ని సందర్భాల్లో డబ్బు కనిపించడం, నోట్లు లెక్కపెట్టడం లేదా ఎవరో మనకు డబ్బు ఇస్తున్నట్లు అనిపించడం జరుగుతుంది. అప్పుడు చాలా మందికి ఇది శుభమా లేక అశుభమా అన్న సందేహం వస్తుంది. స్వప్నశాస్త్రం ప్రకారం, ఇలాంటి కలలకు రాహువు ముఖ్య పాత్ర పోషిస్తాడని నిపుణులు చెబుతున్నారు.

Update: 2025-08-21 15:00 GMT

కలలో డబ్బు కనపడితే లేదా ఎవరో మీకు డబ్బు ఇస్తే – అది ఆర్థిక లాభానికి సూచనగా పరిగణిస్తారు.

నాణేలు కనపడితే – అది శుభ సూచకం కాదు, ఆర్థిక ఇబ్బందుల సంకేతం.

ఎవరైనా మీకు డబ్బు ఇస్తున్నట్లు కనపడితే – మీరు ఆర్థిక పరమైన స్థిరత్వం పొందుతారని భావిస్తారు.

చిరిగిన నోట్లు లేదా డబ్బు మాయం కావడం – ఇది అశుభం, సంపద నష్టానికి సూచన.

పాతిపెట్టిన డబ్బు కనపడితే – అనుకోని సంపద, గౌరవం వచ్చే అవకాశం ఉంటుంది.

ఎవరైనా మీ డబ్బు దొంగిలిస్తే – ఇది శుభ సూచన, త్వరలో ధనవంతులు అవుతారని అర్థం.

లాటరీ గెలవడం కలలో కనపడితే – జీవితంలో పెద్ద మార్పు కోసం మనసులో ఉన్న కోరికల ప్రతిబింబం.

అధిక డబ్బు లేదా సంపద కలలో కనపడితే – అది మరింత సౌకర్యవంతమైన జీవితం కోసం ఉన్న ఆశలు, కోరికలను తెలియజేస్తుంది.

అందువల్ల, కలలో డబ్బు కనపడటం ఎల్లప్పుడూ ఒక రకమైన సంకేతమే. కొన్నిసార్లు అది శుభఫలితాన్ని సూచిస్తే, కొన్నిసార్లు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తుంది.

Tags:    

Similar News