Eye Irritation: కళ్లు దురదగా ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు.. ఈ నివారణలు పాటిస్తే ఉపశమనం..!

Eye Irritation: కళ్లు చాలా సున్నితమైన అవయవాలు. కాబట్టి వాటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

Update: 2023-06-07 15:00 GMT

Eye Irritation: కళ్లు దురదగా ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు.. ఈ నివారణలు పాటిస్తే ఉపశమనం..!

Eye Irritation: కళ్లు చాలా సున్నితమైన అవయవాలు. కాబట్టి వాటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కళ్లు తరచుగా దురద పెడుతుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది రాత్రిపగలు తేడా లేకుండా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఉపయోగిస్తున్నారు. వీటిపై ఎక్కువసేపు గడపడం వల్ల కళ్లలో నొప్పి లేదా చికాకు సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇవి పెద్ద సమస్యలుగా మారుతాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి నివారణలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

కంటి సమస్యల లక్షణాలు

1. కళ్ళు ఎర్రబడటం

2. కళ్లలో మంట

3. కళ్లలో నీరు రావడం

4. లైట్‌ కారణంగా నొప్పి

5. తలనొప్పి

1. కళ్లలో మంటను తగ్గించాలంటే దోసకాయ ఉపయోగించాలి. దీనిని ముక్కలుగా కట్ చేసి కళ్లపై కొద్దిసేపు ఉంచాలి. ఇది బర్నింగ్ సమస్యను తొలగిస్తుంది. ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని దోసకాయను కోసి కళ్లపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. కంటి చికాకు, నొప్పి నుంచి విముక్తి పొందడానికి బంగాళాదుంపను తినవచ్చు. వీటిని ముక్కలుగా కట్ చేసి కళ్లపై పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత కళ్ళు శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.

3. కంటి సమస్యల నుంచి బయటపడేందుకు రోజ్ వాటర్‌ని వాడవచ్చు. ఇది ఔషధం కంటే తక్కువేమి కాదు. కళ్ళకు తక్షణ ఉపశమనాన్ని అందించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మంటను తొలగించడానికి ఉదయం, సాయంత్రం కళ్లలో 2 చుక్కల చొప్పున రోజ్ వాటర్ వేసుకోవాలి.

4. కంటి దురదను వదిలించుకోవడానికి తేనెను కూడా ఉపయోగించవచ్చు. కళ్లలో వేసుకున్నప్పుడు కొంచెం మంటగా అనిపించినా తర్వాత మంచి ఫలితం ఉంటుది.

Tags:    

Similar News