Black Foods: నల్లగా ఉన్నాయంటే తక్కువ అంచనా వేయొద్దు.. ఆరోగ్యానికి సూపర్ హీరోలు ఈ ఫుడ్స్!
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి చాలామంది పండ్లు, కూరగాయలు తీసుకుంటారు. కానీ ఆహారం ఎంచుకోవడంలో సరైన క్రమం పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బ్లాక్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. మీ డైట్‌లో ఇవి చేర్చుకుంటే శరీరానికి పలు రకాల రక్షణ లభిస్తుంది.

నల్ల అత్తిపండ్లు (Black Figs)
తీపి రుచితో ఆకట్టుకునే అంజీర్‌లో చక్కెర పరిమాణం తక్కువగా ఉంటుంది. ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఈ పండ్లను వైద్యులు కూడా తినమని సూచిస్తున్నారు. రాత్రి రెండు నల్ల అత్తిపండ్లు నానబెట్టి, ఉదయం పరగడుపున తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
నల్ల వెల్లుల్లి (Black Garlic)
రుచికరమైన బ్లాక్ గార్లిక్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. యాంటీబాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలతో ఇది శరీరాన్ని రోగాల నుండి కాపాడుతుంది.
మినుములు (Black Gram)
ప్రోటీన్ లోపాన్ని తగ్గించడంలో మినుములు అద్భుతం. వీటిలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ B6, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. గుండె, నాడీ వ్యవస్థకు ఇవి బలాన్ని ఇస్తాయి.
నల్ల ఎండుద్రాక్ష (Black Raisins)
ప్రోటీన్, ఫైబర్, ఐరన్, విటమిన్ C వంటి అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. రక్తహీనత, గుండె సమస్యలు, ఎముకలు, జుట్టు, చర్మం — అన్నింటికీ ఇది ఎంతో మేలు చేస్తుంది.
బ్లాక్ రైస్ (Black Rice)
వైట్ రైస్‌కు బదులుగా బ్లాక్ రైస్ తీసుకోవడం ఉత్తమం. ఇందులో పీచు, ప్రొటీన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఒత్తిడి తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.