కలలో గుర్రం వస్తే నిజంగా అది జరుగుతుందా..?

Update: 2019-05-28 13:04 GMT

కాస్త కునుకు పట్టిందంటే చాలు. రయ్యిమని కలల వచ్చేస్తాయి. పగటి కలలు కనేవారి సంగతి వేరే. కాకపోతే మన మూడ్ ని బట్టి మనకొచ్చే కలలు కూడా మారిపోతుంటాయి. సంతోషంగా ఉంటే ఒకలా... బాధలో ఉంటే మరోలా వస్తాయి. చాలామందికి.. తమ కలలో ఏం జరిగిందో... నిద్రలేచిన తరువాత గుర్తుండొదు. కాని కొన్ని కలలు మాత్రం ఫ్రేమ్ టూ ఫ్రేమ్ అలాగే మెమొరీలో ఫిక్స్ అయిపోతాయి. కొంతమందికి కలలో గుర్రాలు కనిపిస్తాయి. గుర్రం పరిగెడుతున్నట్లు, గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు, గుర్రంతో కలసి ఈత కొడుతున్నట్లు కలలు వస్తుంటాయి. గుర్రం హుందాతనానికి, శక్తి సామర్థ్యాలకు ప్రతీక. కనుక ఇది కలలో కనిపిస్తే శుభమే అంటున్నారు పెద్దలు. మనకు కలలో గుర్రం వచ్చే సీన్ ని బట్టి వాటి అర్థం, ఫలితం మారిపోతుందట.

గుర్రం పరిగెడుతున్నట్లు కల వస్తే.. అనవసర విషయాల కోసం రిస్క్ చేసి, ప్రమాదాలు తెచ్చుకుంటున్నారని పెద్దలు చెబుతారు. తెల్ల గుర్రాన్ని స్వచ్ఛత, శ్రేయస్సు, అదృష్టానికి సూచనగా భావిస్తారు. కనుక శ్వేత గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు కల వస్తే.. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారట. నల్లగుర్రం కలలోకి వస్తే హింస, క్షుద్ర శక్తులకు సూచనగా చెబుతారు. నల్ల గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు కల వస్తే.. మానసికంగా అసంత‌‌‌ృప్తితో ఉండటాన్ని సూచిస్తుందట. గుర్రం మీద నుంచి పడిపోతున్నట్లు కల వస్తే.. శత్రువులు మీద ఈర్ష్యాద్వేషాలతో ఉన్నారని అర్థం. గుర్రంపై ఈత కొడుతున్నట్లు కల వస్తే.. మీరు కోరుకున్నది తర్వలో నిజమవుతోందని తెలియజేస్తుంది. ఇదే కల వ్యాపారం చేసుకునే వారికి వస్తే.. లాభాలు చేకూరే అవకాశముందట. గుర్రాలు పోట్లాడుకుంటున్నట్లుగా కల వస్తే.. మీ స్నేహితులతో గొడవలు వస్తాయని, మానసిక అశాంతికి కారణమవుతాయని అంటారు. గుర్రం చనిపోయినట్లు కల వస్తే.. మనకు జీవితంలో అండగా ఉండేది మన దగ్గర నుండి దూరమవుతుందట. ఇలా గుర్రాలు ఏ రూపంలో, ఏ సందర్భంతో కలలోకి వస్తాయన్నదానిపై దాని రిజల్ట్ ఆధారపడి ఉంటుందంటున్నారు పండితులు.

Similar News