Quinoa: క్వినోవాకి డిమాండ్‌ పెరుగుతుంది..! ఎందుకో తెలుసా..?

*క్వినోవా అనేది దక్షిణ అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిన ఒక రకమైన ధాన్యం.

Update: 2021-11-19 05:38 GMT

క్వినోవాకి(ఫైల్ ఫోటో)

Quinoa: ఇండియాలో క్వినోవాకి డిమాండ్ విపరీంగా పెరుగుతోంది. మీరు మాల్స్ నుంచి అన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో క్వినోవాను కొనుగోలు చేయవచ్చు. క్వినోవా అనేది దక్షిణ అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిన ఒక రకమైన ధాన్యం. రుచిగా ఉండటమే కాకుండా చాలా పోషకమైనది. మెట్రో నగరాల్లో దీని డిమాండ్ కొంతకాలంగా పెరుగుతోంది.

ఈ ధాన్యంలో గ్లూటెన్ ఫ్రీతో పాటు 9 రకాల అమినో యాసిడ్‌లు ఉంటాయి. అలాగే ప్రొటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. క్వినోవా నలుపు, ఎరుపు, తెలుపు రంగులలో ఉంటుంది.

అన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో ఉపయోగపడుతుంది. దీన్ని రోటీ, ఉప్మా, పోహా, సలాడ్ మొదలైన వాటి రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. క్వినోవా వేగంగా బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

క్వినోవాను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో సలాడ్ రూపంలో తీసుకుంటే ఎక్కువ సమయం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. గ్యాస్ సమస్య, మలబద్ధకం మొదలైనవారు రోజూ క్వినోవా తినాలి.

అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా ఇది జీర్ణవ్యవస్థకు చాలా మంచిదని భావిస్తారు. ఎముకలు బలహీనంగా ఉన్నవారు తప్పనిసరిగా తమ ఆహారంలో క్వినోవాను చేర్చుకోవాలి. ఇతర తృణధాన్యాలతో పోలిస్తే ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

క్వినోవాలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలో రక్తాన్ని వృద్ధి చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు క్వినోవాను క్రమం తప్పకుండా తీసుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి క్వినోవా చాలా ఉపయోగకరం.

ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్వినోవా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే దీనిని డైట్‌లో చేర్చుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Tags:    

Similar News