బైక్ నడపడం చేతకాదనే బాధ పడుతున్నారా.. మీ పిల్లలు బైక్ మీద స్పీడ్‌గా వెళ్తుంటే మీరు బయపడుతున్నారా.. ట్రాఫిక్‌లో ఎవరు ఎప్పుడూ వచ్చి మన బైక్ కి యాక్సిండెట్ చేస్తారనే కంగారు పడుతున్నారా.. ఇక నుంచి మీకు ఇలాంటి సమస్యలు ఉండవు. అన్నింటి కంటే ముఖ్యమైంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోతారమోనని టెక్షన్ కూడా పడనవసరంలేదు. ఎందుకంటే రిమోట్ సెన్సార్‌తో పనిచేసే బైకులు మీ అన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యుషన్ ఇవ్వబోతోంది. రిమోట్ సెన్సార్‌తో నడిచే ఈ బైకులు నిజంగా వింతే.
రిమోట్ సెన్సార్‌తో పనిచేసే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బైకులు వాటంతటవే ఎక్కడికైనా వెళ్లిపోగలవు. మీరు కోరుకున్న చోటికి దర్జాగా తీసుకెళ్తుంది. పైగా నో రిస్క్.ఎదురుగా ఏదైనా వాహనం ఉన్నప్పుడు హారన్ కొడుతుంది. ఆటోమెటిక్ గా బ్రేక్ కూడా వేయగలవు. బైక్ ఆగినప్పుడు స్టాండ్ వేయడం వంటి పనులు కూడా ఇదే చేసుకుంటుంది. మనుషులు నడుపుతున్న వాహనం నుంచి ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటే ముందే పసిగట్టి వార్నింగ్ ఇస్తుంది. బైకు వెనుకభాగంలో ఉన్న రోబో మిషన్లు బైక్‌ని కంట్రోలు చేసే విదంగా అమర్చారు.
బైక్ బాక్ సైడ్‌లో ఉండే రోబో మిషన్ల సహాయంతో ఇదంతా సాధ్యం అవుతుందంటున్నారు స్టీఫన్ హాన్స్. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అయిన స్టీఫన్ ఈ బైక్‌ను రూపొందించాడు. బీఎండబ్ల్యూ ఆర్1200 జీఎస్ పేరుతో ఈ బైక్‌ను మార్కెట్లోకి కూడా విడుదల చేశారు. మార్కెట్లో ఇప్పుడు ఇది సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టనుంది. సో తొందర్లోనే మన రోడ్ల మీద రిమోట్‌తో నడిచే బైకులు రయ్ మని దూసుకుపోవడం ఖాయం.