Lifestyle: రోజూ ఈ పండ్లు తింటే.. థైరాయిడ్ రమ్నన్నా రాదు
Thyroid: థైరాయిడ్ సమస్యను తగ్గించడంలో కొన్ని ఫలాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆహారంలో వీటిని చేర్చడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Lifestyle: రోజూ ఈ పండ్లు తింటే.. థైరాయిడ్ రమ్నన్నా రాదు
Thyroid: థైరాయిడ్ సమస్యను తగ్గించడంలో కొన్ని ఫలాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆహారంలో వీటిని చేర్చడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో జీవనశైలి మార్పులు, చెడు ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. అందులో థైరాయిడ్ ఒకటి. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయకపోతే శరీర బరువు పెరగడం లేదా తగ్గడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్ని ఫలాలను ఆహారంలో చేర్చడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
1. నారింజ:
విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండే నారింజ, థైరాయిడ్ కారణంగా కలిగే గ్రంథుల శోథాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ ఒక నారింజ తినడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
2. పైనాపిల్:
విటమిన్ బి, సి, మ్యాంగనీస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే పైనాపిల్, శరీరానికి శక్తిని అందించడంతో పాటు అలసటను తగ్గిస్తుంది. ఇది థైరాయిడ్ లక్షణాలను క్రమంగా తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
3. ఉసిరి:
విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఉసిరి శక్తి స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది థైరాయిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిని ప్రతి రోజు డైట్‌లో చేర్చడం మంచిది.
4. ఆపిల్:
రోజూ ఒక ఆపిల్ తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్‌ను సమతుల్యం చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది.
5. కొబ్బరి:
పచ్చి కొబ్బరి లేదా కొబ్బరి సంబంధిత ఆహార పదార్థాలు (చట్నీ, లడ్డూ వంటివి) థైరాయిడ్ ఫంక్షన్‌కు అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వును అందిస్తాయి. ఇవి మెటాబాలిజాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించాలి.