నీరు తక్కువగా తాగుతున్నారా..? అయితే సమస్యే..

Update: 2019-05-13 03:34 GMT

సాధారణంగా మనిషి మనుగడ సాధించాలంటే నీరు ఎంతో అవసరం. ఒకమనిషికి రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీరు అవసరమని వైద్యనిపుణులు చెబుతుంటారు. కానీ చాలామంది నీరు తక్కువగా తీసుకుంటుంటారు. ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. శరీరములో రక్తంకి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి అంతే విలువ ఉంది. మానవ శరీరములోద్రవ పదార్ధాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలము సరఫరా చేయడంలో నీరు ముఖ్య పాత్రవహిస్తుంది. నీటిలో క్లోరిన్‌, ఆక్సిజన్ వంటి వాయువులు సమపాళ్ళలో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాడు. ఇక అధిక సంఖ్యలో నీరు కూడా తీసుకోవడం ప్రమాదకరం. రక్తం ఈ అధిక నీటితో బాగా పలుచబడిపోయి సోడియం గాఢత బాగా పడిపోతుంది. నీటిని బాగా పీల్చుకున్న కణజాలం బాగా ఉబ్బుతుంది. ఈ పరిణామంతో మనిషికి మత్తు ఆవహిస్తుంది. పరిస్థితి అంతటితో ఆగకుండా గాబరా, శక్తి హీనత, తలనొప్పితో పాటు నడవలేని స్థితికి వెళ్లిపోతారు. అందువల్ల తగినంత మోతాదులోనే నీటిని తీసుకోవాలి.

*నీరు తాగడం వలన కలిగే లాభాలు..

ప్రతిరోజు శరీరరానికి తగినంత నీటిని త్రాగడం వల్ల రక్తం విస్తరిత ప్రసరణ గొప్పగా జరుగుతుంది. శరీరంలోని కొవ్వుని కాల్చేస్తుంది. నాడీవ్యవస్థ లోవున్న కొవ్వు ని బయటకు తొలగించి నాడీ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. నీటిని తాగడం ద్వారా యవ్వనమైన చర్మాన్ని కలిగి ఉండవచ్చు. నీరు తాగడం వలన మెరిసే జుట్టు పొందడం సులభం. ఇది జుట్టు మొదల్లో ఉన్న నరాలను శక్తివంతం చేస్తుంది. కడుపులో అధిక యాసిడ్స్,ఆమ్లాలు రాకుండా ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల నొప్పితో కూడిన మంటను తగ్గిస్తుంది. శరీరంలో నీటిశాతం సరిగ్గా లేకపోతే చర్మం ముడతలు పడటం, చర్మ సమస్యలు, వంటివి ఏర్పడతాయి. అందుకే మన శరీరంలో 75 నుంచి 80 శాతం నీరు ఉండాలి.

*శరీరరానికి తగినంత మోతాదులో నీరు తాగకపోవడం వలన వచ్చే సమస్యలు..

నీళ్లు తాగనందువల్ల శరీరం తనకున్న ప్రతి నీటి చుక్కనీ దాచుకోవడం మొదలుపెడుతుంది. దాంతో శరీరం బరువు పెరుగుతుంది. అలాగే నీళ్లు ఎక్కువగా తాగకపోతే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. మలబద్ధకం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలూ ఇబ్బంది పెడతాయి. తగినంత నీరు తాగకపోతే ముఖం వాడిపోతుంది. చర్మం ముడతలు ముడతలుగా కనిపిస్తుంది. మనసంతా ఆందోళనగా, విసుగ్గా ఉంది అంటే మీ శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోవడమే కారణం కావొచ్చు. నీటిశాతం తగ్గిన యుక్తవయసు పిల్లల్లో మెదడు పరిమాణం తగ్గుతున్నట్టు కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు.

Similar News