Health Tips: ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆహారాలు డైట్‌లో చేర్చితే మంచి ఫలితాలు..!

Health Tips: నేటి ఆధునిక కాలంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి.

Update: 2024-03-30 16:00 GMT

Health Tips: ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆహారాలు డైట్‌లో చేర్చితే మంచి ఫలితాలు..!

Health Tips: నేటి ఆధునిక కాలంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గంటల తరబడి కూర్చొని చేసే జాబులు చేయడం వల్ల ఈ సమస్య మరింత పెరిగింది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది ఊబకాయానికి గురవుతున్నారు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీని కారణంగా టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్, ఎముకల ఆరోగ్యం, పునరుత్పత్తి దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వీలైనంత త్వరగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి చర్యలు తీసుకోవడం అవసరం. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

స్థూలకాయాన్ని దూరం చేసుకోవాలంటే వ్యాయామంతో పాటు హెల్తీ డైట్, యాంటీ ఒబెసిటీ ఫుడ్స్ తీసుకోవడం అవసరం. కొవ్వును తగ్గించుకోవడానికి ఇది సహజమైన మార్గం. మీరు నిరంతరం పెరుగుతున్న ఫ్యాట్‌ వల్ల ఇబ్బంది పడుతున్నారు అదనపు కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే ఈ 5 ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలి.

పచ్చి మిరపకాయ

ఒక అధ్యయనం ప్రకారం పచ్చి మిరపకాయలు తినడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. నిజానికి ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ 2-3 పచ్చి మిరపకాయలు తినడం బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

పెసర్లు

పెసర్లలో విటమిన్ ఎ, బి, సి, ఇ ఉంటాయి. వీటిలో పెద్ద పరిమాణంలో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. వీటి కారణంగా బరువు తగ్గుతారు.

యాలకులు

యాలకులు తినడం వల్ల శరీరంలోని జీవక్రియలు పుంజుకుంటాయి. బరువు తగ్గే వారు క్రమం తప్పకుండా యాలకులను తీసుకోవాలి.

కరివేపాకు

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఒబేసిటీ లక్షణాలు ఉంటాయి. ఈ పరిస్థితిలో బరువు తగ్గడంలో సాయపడడమే కాకుండా దాని వినియోగం శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది .

గ్రీన్ టీ

గ్రీన్ టీ బరువు తగ్గడానికి ప్రసిద్ధి చెందిన పానీయం. అయితే దీన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడం జరగదు. కానీ కొవ్వును కాల్చడంలో ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీన్ని రోజూ తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది ఆకలి తగ్గుతుంది. కాబట్టి తక్కువ తినడం వల్ల బరువు పెరగరు.

Tags:    

Similar News