Fast Food Side Effects: ఫాస్ట్​ఫుడ్​ ఎక్కువగా తింటున్నారా.. ఆయుష్షు తగ్గించుకున్నట్లే..!

Fast Food Side Effects: ఆధునిక కాలంలో ఫాస్ట్​ఫుడ్​ తినే ట్రెండ్​ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా యువత దీనికి బానిసలుగా మారుతున్నారు.

Update: 2024-02-26 15:00 GMT

Fast Food Side Effects: ఫాస్ట్​ఫుడ్​ ఎక్కువగా తింటున్నారా.. ఆయుష్షు తగ్గించుకున్నట్లే..!

Fast Food Side Effects: ఆధునిక కాలంలో ఫాస్ట్​ఫుడ్​ తినే ట్రెండ్​ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా యువత దీనికి బానిసలుగా మారుతున్నారు. కొంతమంది ఇంట్లో వండిన ఆహారాన్ని వదిలిపెట్టి దాని రుచికి మరిగిపోయారు. దీనివల్ల చాలా సైడ్​ఎఫెక్ట్స్​ వస్తాయని తెలిసి మరీ తింటున్నారు. రెగ్యులర్​గా ఫాస్ట్​ఫుడ్​ తినడం వల్ల ధీర్ఘకాలిక సమస్యల బారిన పడుతుంటారు. ఇందులో బీపీ, షుగర్​ లాంటివే కాకుండా కిడ్నీలు కూడా పాడవుతున్నాయి. ఫాస్ట్​ఫుడ్​ వల్ల శరీరానికి కలిగే నష్టాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఫాస్ట్ ఫుడ్‌లో ఉప్పు ఎక్కువగా వేస్తారు. ఇది హై బీపీకి కారణమవుతుంది. దీంతో మూత్రపిండాలపై అధిక ఒత్తిడి పడుతుంది. కాలక్రమేణా ఇది మూత్రపిండాల పనితీరును దెబ్బతీసి వాటి ఫెయిల్యూర్​కు కారణమవుతాయి. ఫాస్ట్ ఫుడ్ లో ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడికి కారణం అవుతాయి. ఇవి కూడా మూత్రపిండాలు దెబ్బతినడానికి, పనిచేయకపోవడానికి దారితీస్తుంది. ఫాస్ట్ ఫుడ్ లో చక్కెర పానీయాలు, డెజర్ట్‌లు, ఇతర బేకింగ్ పదార్థాలు ఉంటాయి. వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి బరువు పెరగడానికి, ఇన్సులిన్ నిరోధకతకు, మధుమేహం ప్రమాదానికి కారణమవుతాయి. ఇవన్నీ మూత్రపిండాలను బాగా దెబ్బతీస్తాయి.

సాధారణంగా ఫాస్ట్ ఫుడ్‌లో ఫైబర్ కంటెంట్​ తక్కువగా ఉంటుంది. ఈ పోషకాలు లేని ఆహారం మూత్రపిండాల్లో రాళ్లు, ఇతర కిడ్నీ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఫాస్ట్ ఫుడ్ లో ఉప్పు ఎక్కువ, నీటి శాతం తక్కువ ఉంటుంది కాబట్టి శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. ఫాస్ట్ ఫుడ్ రెగ్యులర్ గా తీసుకుంటే విపరీతమైన బరువు పెరుగుతారు. మీ బరువును మీరే మోయలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఊబకాయం మూత్రపిండాల వ్యాధులకు కారణం అవుతుంది. ఫాస్ట్ ఫుడ్‌లోని అధిక క్యాలరీలు, అధిక చక్కెర కంటెంట్ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.

Tags:    

Similar News