Fruits: ఈ 5 పండ్లతో మెరిసే అందం..నిత్య యవ్వనం, మీరే న్యాచురల్ బ్యూటీ..!

Anti Ageing Fruits: పండ్లు ఆరోగ్యకరం మాత్రమే కాదు. మీ చర్మానికి అందని కూడా పెంచుతాయి. దీంతో నిత్య యవ్వనంగా కనిపిస్తారు. మీ స్కిన్ కేర్ రొటీన్‌లో పండ్లు చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

Update: 2025-03-15 09:26 GMT

Anti Ageing Fruits: పండ్లను మన రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల చర్మం, ఆరోగ్యంగా యవ్వనంగా కనిపిస్తుంది. అలాంటి ఐదు రకాల పండ్లలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఆరోగ్యకరం హైడ్రేటెడ్‌గా ఉండటమే కాదు మీ చర్మం నిత్య యవ్వనంగా కనిపిస్తుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

బెర్రీ జాతికి చెందిన పండ్లు బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీలు, స్ట్రాబెరీలను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇందులో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. మీ చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.

అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇందులోనే సహజసిద్ధంగా విటమిన్ ఇ, విటమిన్ సి ఉంటుంది. చర్మానికి మాయిశ్చర్ అందిస్తుంది. అవకాడోలో మప డైట్‌లో చేర్చుకోవడం వల్ల పొడిబారిన చర్మానికి మంచి రెమెడీ. ముఖంపై మచ్చలు, గీతాలు తొలగిస్తుంది.

సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయ, ఆరెంజ్ తీసుకోవడం వల్ల కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే గుణాలు ఉంటాయి. రెగ్యులర్‌గా ఇవి తినడం వల్ల మీ చర్మం మెరుస్తుంది. నల్ల మచ్చలు తొలగిపోతాయి. సన్ డ్యామేజ్ నుంచి కాపాడుతాయి.

మండే వేసి వేసవిలో పుచ్చకాయలు తినడం వల్ల ఇందులో అధిక నీటి శాతంతో పాటు విటమిన్ ఏ, విటమిన్ b6, విటమిన్ సి కూడా అందుతుంది. ఇది చర్మానికి హైడ్రేషన్ అందించి పునరజ్జీవనం ఇస్తుంది. రెగ్యులర్‌గా పుచ్చకాయ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు పోతాయి. చర్మం నిత్య యవ్వనంగా కనిపిస్తుంది.

యాపిల్ ప్రతిరోజు మన డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఫైబర్ జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. డిటాక్సిఫై చేస్తుంది, మీ చర్మం యవ్వనంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది స్కిన్ డ్యామేజ్ కాకుండా త్వరగా ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తుంది.

Tags:    

Similar News