పసుపుతో ఆరోగ్యప్రయోజనాలు..

పసుపుతో ఆరోగ్యప్రయోజనాలు.. పసుపుతో ఆరోగ్యప్రయోజనాలు.. పసుపుతో ఆరోగ్యప్రయోజనాలు..

Update: 2019-09-30 11:09 GMT

మనం రోజు కూరల్లో వెసుకునే పసుపుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పసుపులోని ఔషధ గుణాలు చాలా రకాల రోగాలను కాపాడుతుంది. వాటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని కేవలం వంటల్లోనే కాకుండా వివిధ రకాల ఔషధ తయారిలో కూడా ఉపయోగిస్తారు. రోజూ చిటికెడు పసుపు ఉపయోగిస్తే చాలు అరోగ్యంగా దృఢంగా ఉండవచ్చు.

గాయాల వల్ల ఏర్పాడే నొప్పి, వాపులను చిటికెలో తగ్గించగల సామర్ధ్యం పసుపుకు ఉంటుంది. గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే ఎసిడిటీ, హార్ట్‌బర్న్ వంటి సమస్యలు దరిచేరవు. కడుపులో వికారంగా అనిపిస్తున్నప్నుడు ఒక కప్పు వేడినీళ్లలో అర టీస్పూన్ పసుపు, అల్లం రసం కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది. ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి వంటివి పసుపులో సమృద్దిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఉపయెగపడుతుంది

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ పాటు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి.కేన్సర్ కణాలతో నివారించే లక్షణాలు పసుపులో పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి ఔషధ గుణాలు అనేకం పసుపులో ఉంటాయి. చాలా రకాల ఔషధ గుణాలకు పసుపు చిరునామ. కావున రోజు తినే కూరలో పసుపును తప్పక ఉపయోగిచండి.

Tags:    

Similar News