వారికసలు కలలు వచ్చే అవకాశమే లేదట

Update: 2019-05-27 13:39 GMT

ఓ సినీ గేయ రచయిత చెప్పినట్లు.. అలసిన శరీరం ఆదమరచి నిద్రపోతుంది. నిద్రపోతున్నప్పుడు కూడా మెదడు బాగా పనిచేస్తుంది. పడుకున్నప్పుడు ఎన్నో కలలు వస్తుంటాయి. నిద్రలేచింది మొదలు.. రాత్రి పడుకునేవరకూ జరిగిన విషయాల్లో కొన్ని కలలుగా వస్తుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే నిద్రలేచిన తరువాత గుర్తుంటాయి.

వయసులో ఉన్న వారికి వచ్చే కలలు చాలా తీయగా ఉంటాయట. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలకు, పురుషుల గురించి కలలు వస్తుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మగవారు అయితే అందమైన అమ్మాయిల గురించి కలలు కంటారట. అబ్బాయిలకు ఇలాంటి కలలు వచ్చినప్పుడు.. ఆ అందమైన కల నిజం అయితే ఎంత బావుండు అనిపిస్తుందట. అయితే డ్రింక్ చేసేవారికి, స్మోక్ తాగేవారికి కలలు ఎక్కువగా వస్తుంటాయి.

నిద్రలో గురక పెట్టే వారికి అసలు కలలు వచ్చే అవకాశమే లేదట. గురక పెట్టే వారినుంచి దూరంగా ఎలా అయితే పక్కన పడుకున్నవారు పారిపోతారో.. కలలు కూడా అలానే వారి నుంచి పారిపోతాయట. మరో విషయం ఏంటంటే.. కళ్లు లేని వారికి కూడా కలలొస్తుంటాయి.

చాలామందికి కలలు వారి సమస్యలకు పరిష్కార మార్గాలను చూపిస్తాయట. చాల వరకు ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్ కలలోనే దొరుకుతుందని నమ్మేవారు ఉన్నారు. కోపం, బాధ, భయం ఇలాంటి భావోద్వేగాలే కలల రూపంలో కవ్విస్తుంటాయని చెబుతున్నారు పరిశోధకులు. 

Similar News