Work Pressure: ఆఫీసులో పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇవి పాటించండి..!

Work Pressure: ఈ బిజీ లైఫ్‌లో ఆరోగ్యంపై తప్ప అన్నింటిపైనా శ్రద్ధ వహిస్తున్నాం. రోజూ ఎనిమిది నుంచి పది గంటలు ఆఫీసులో గడుపుతున్నాం.

Update: 2022-02-23 11:30 GMT

Work Pressure: ఆఫీసులో పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇవి పాటించండి..!

Work Pressure: ఈ బిజీ లైఫ్‌లో ఆరోగ్యంపై తప్ప అన్నింటిపైనా శ్రద్ధ వహిస్తున్నాం. రోజూ ఎనిమిది నుంచి పది గంటలు ఆఫీసులో గడుపుతున్నాం. చాలా మంది నిరంతరం కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుంటారు. ఖాళీ సమయం దొరికితే మొబైల్‌కి అతుక్కుపోతారు. ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు కూడా మొబైల్‌లో బిజీగా ఉంటారు. లేదంటే కళ్ళు టీవీ స్క్రీన్‌పైనే ఉంటాయి. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యంపై పెద్ద దెబ్బ పడుతోంది. అందుకే ఈ నాలుగు పద్దతులను పాటించండి. ఒత్తిడి నుంచి తప్పించుకోండి.

ప్రస్తుతం 5 రోజుల పని కారణంగా పని గంటలు 9కి పెరిగాయి. కానీ తొమ్మిది గంటల్లో పని పూర్తి చేయడం అసాధ్యం. అది చాలా అరుదుగా జరుగుతుంది. కొన్నిసార్లు డ్యూటీ గంటలు 10 నుంచి 11 గంటలు పడుతుంది. అందుకే ఆఫీసులో పని మధ్య విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. కొద్దిసేపు నడవాలి. ఆఫీసు నుంచి బయటకు వచ్చి సూర్యరశ్మిని ఆస్వాదించాలి. ఆఫీసుకు వెళ్లేందుకు లిఫ్ట్‌కు బదులుగా మెట్లను ఉపయోగించాలి. ఎందుకంటే నిరంతరం కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోతుంది.

నేటి పని సంస్కృతి కంప్యూటర్ లేదా మొబైల్‌కే పరిమితమైంది. అందుకే కళ్లు ఎప్పుడూ కంప్యూటర్ స్క్రీన్ మీదనో లేదంటే మొబైల్ సెట్ మీదనో ఉంటాయి. కళ్లలో నొప్పి, దృష్టిలో ఇబ్బంది, తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడటానికి ఇదే కారణం. ఒక గంట లేదా రెండు గంటల తర్వాత కొద్దిగా విరామం తీసుకొని కళ్లకు విశ్రాంతి ఇవ్వండి. మంచినీటితో కళ్లను తరచుగా శుభ్రం చేస్తూ ఉండండి.

పని సంస్కృతితో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారాయి. మనలో చాలా మంది రెడీమేడ్ ఫుడ్‌పై ఆధారపడుతున్నారు. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు ఎన్ని టీ-కాపీలు తాగుతున్నామో తెలియదు. ఈ రకమైన సంస్కృతి మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఏదైనా తీవ్రమైన వ్యాధి వచ్చే వరకు దాని గురించి మనకు తెలియదు. అందుకే టీ, కాఫీలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఆహారంలో పండ్లను చేర్చండి. విరామం తీసుకునేటప్పుడు ఆహారం తినండి.

ఉదయాన్నే ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరి సాయంత్రం ఆలస్యంగా ఇంట్లోకి ప్రవేశిస్తాం. సూర్యుడు, గాలి, చంద్రుడు, సూర్యునితో సంబంధం ఉండదు. శరీరానికి సూర్యకాంతి లేదా స్వచ్ఛమైన గాలి లేకపోవడం అతిపెద్ద కారణం. ఎముకలకు ప్రత్యక్ష సూర్యకాంతి, తాజా గాలి చాలా ముఖ్యం. నిరంతరం కుర్చీలో కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి తిరగాలి.

Tags:    

Similar News