టైం కానీ టైంలో ఆకలి వేస్తుందా? అయితే..

Update: 2019-05-16 07:03 GMT

ఉదయం బ్రెక్‌ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఇది ఓ సగటు జీవి రోజువారీ పాటించే ఆహార నియమం. అయితే కొన్నిసార్లు రోజులో ఏ సమయంలోనైనా ఆకలి ఇబ్బందిపెట్టవచ్చు? టైం కానీ టైంలో ఆకలి వేయడం దానికి ఏదో ఒక ఆహారాన్ని తీసుకోవడం. చివరకు అది అనారోగ్య పరిస్థితులకు దారితీయడం కామన్ అయిపోయింది.

అయితే అటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు, ఆకలిని ఏవిధంగా నియంత్రించవచ్చో కొన్ని పద్దతులు పాటిస్తే చాలు.. అవేంటో ఓ సారి చూద్దాం... సమయపాలనలో ఆహారం తీసుకున్నా కూడా తిరిగి ఆకలి వేయడానికి అనేక కారణాలున్నాయి. మనం తీసుకునే ఫుడ్‌లో తగిన ప్రొటీన్ లేకపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సరియైన సమయానికి నిద్ర లేకపోవడం రిఫైండ్ కార్బోహైడ్రేట్లను తీసుకోకపోవడం,పీచు అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తినకపోవడం వల్ల సమయం కానీ సమయంలో ఆకలి వేయడానికి కారణమవుతుంది. . తగినంత నీరు తాగకపోవడం ఆల్కహాల్ ,ధూమపానం సేవించడం వంటివి ఆహారనియమాలను తప్పేలా చేస్తున్నాయి. సహజసిద్దమైన మార్గాలను అనుసరించడం ద్వారా అసహజ ఆకలిని అరికట్టవచ్చు.

పీచు అధికంగా వుండే బీన్స్, బఠానీలు, చిక్కిస్, పప్పు ధాన్యాలు వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ రిచ్ ఆహార పదార్ధాల వల్ల కడుపు 31 శాతం సంపూర్ణంగా ఉంటుంది. దీంతో కడుపు నిండినట్లుగా ఉండడంతో తొందరగా ఆకలి కలగకుండా చూడగలుగుతుంది. ఫైబర్ ఆకలి పెంచే హార్మోనులను అదుపులో ఉంచుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చూస్తాయి. కొవ్వు కణాల నుంచి విడుదలయ్యే లెప్టిన్ హార్మోన్ ఆకలిని తగ్గించగలదు. ముఖ్యంగా లెప్టిన్ లోపం విపరీతమైన ఆకలికి కారణం కాగలదు. భోజనానికి ముందు తక్కువ క్యాలరీలతో కూడిన సలాడ్ తీసుకుంటే మంచిది.మంచి ఆహార నియమాలతో అసహజ ఆకలిని తగ్గించుకోవడానికి ప్రయత్నిచండి 

Similar News