అవసరమైన సమయంలో నీరు త్రాగకుంటే..

Update: 2019-05-20 13:34 GMT

ఎండ ప్రతాపం రోజురోజుకి పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుండే వేడి వాతావరణం కనపడుతుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పిల్లలు, వృద్ధులు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. ఎండ తీవ్రతకు శరీరంలోని నీరంతా చమట రూపంలో బయటికి వస్తుంది.. తద్వారా డీ హైడ్రేష‌న్ కు గురయ్యే అవ‌కాశం ఉంది. డీ హైడ్రేష‌న్ సమస్య వచ్చిందంటే వాంతులు, విరోచనాలు వచ్చే ప్రమాదం ఉంది. డీ హైడ్రేష‌న్ కు గురికాకుండా ఉండాలి అంటే నీరు సరైన సమయంలో తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది రోజంతా శరీరానికి అవసరమైనప్పుడు సరిపడా నీరు తీసుకోరు. సరిపడా నీరు శరీరానికి అందకపోతే శరీరంలో వచ్చే ప్రధాన సమస్య డీహైడ్రేషన్. అందునా ఎండాకాలం ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.

రోజులో 10 నుంచి 12 నీరు త్రాగడం మంచిది. అయితే ఈ నీరు కూడా ఒకేసారి ఎక్కువమొత్తంలో తాగకూడదు. మోతాదుకు మించి నీరు ఎక్కువగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. రక్తం ఈ అధిక నీటితో బాగా పలుచబడిపోయి సోడియం గాఢత తగ్గిపోతుంది. అంతేకాకుండా నీటిని బాగా పీల్చుకున్న కణజాలం బాగా ఉబ్బుతుంది. ఈ పరిణామంతో మనిషికి మత్తు ఆవహిస్తుంది. మనిషికి ఆకలి అనే విషయం ఎలా తెలుస్తుందో దాహం కూడా అంతే.. ఎప్పుడైతే శరీరానికి దాహం వేస్తుందో అప్పుడే ఖచ్చితంగా నీరు త్రాగాలి. దీనిద్వారా అవసరమైనప్పుడు శరీరానికి నీరు అందుతుంది. దాంతో అవయవాలు చురుకుదనంతో పనిచేస్తాయి, అంతేకాకుండా డీ హైడ్రేష‌న్ కు గురికాకుండా ఉంటారు. కాబట్టి దాహం వేసినప్పుడు లేట్ చేయకుండా నీరు తీసుకోవడం మంచిది. 

Similar News